ఆంధ్రప్రదేశ్‌

మీ సేవ కేంద్రాలపై ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మీ సేవ కేంద్రాల నిర్వహణ విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయాల నియామకాల్లో మీ సేవ సిబ్బందికి తగిన స్థానం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ సేవ కేంద్రాల పాత్ర ఎనలేనిదన్నారు. రాష్టవ్య్రాప్తంగా 9వేల మీ సేవ కేంద్రాలు ఉన్నాయని, దాదాపు 50వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. లక్షలాది రూపాయలు తమ సొంత పెట్టుబడితో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు 40 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 400 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్లకు సంబంధించి చేసిన విధివిధానాల ప్రకటనతో మీ సేవ కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని లేఖలో రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.