ఆంధ్రప్రదేశ్‌

రుతుపవనాల ప్రభావంతో భారీవర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఆదివారం రాత్రి పేర్కొంది. ఇవి సాధారణంగానే ఉంటాయని, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్రం తెలియజేసింది. పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రాంతాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని, అయితే దీని ప్రభావం ఆంధ్రాకు ఏమాత్రం ఉండదని కేంద్రం వివరించింది. తేమ ఎక్కువగా ఉన్నందున, రుతుపవనాలు సాధారణంగా ఉన్నందున తేలికపాటి వర్షాలు మాత్రం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం తెలిపింది.