ఆంధ్రప్రదేశ్‌

పారదర్శక పాలనే సీఎం జగన్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 18 : సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పారదర్శక పాలన అందిస్తున్నారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో ఆదివారం రఘుపతి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో పిచ్చాపాటి మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో చారిత్రక బిల్లులను ఆమోదించినందుకు తాను గర్వపడుతున్నానని రఘుపతి పేర్కొన్నారు. ఎవరైనా ఆలయ భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీఎ జగన్ బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, అలాగే నవరత్నాలుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు రూ. 235 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. అనంతరం నగరంలోని లలిత కళా పరిషత్‌లో నిర్వహించిన జిల్లా బ్రాహ్మణుల ఆత్మీయ సభ ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘వరద’ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ అవినీతి రహిత, పారదర్శక పాలనకు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష నేతలు వక్రబుద్ధితో బురద జల్లుతున్నారని, ఇలాంటి కుటిల రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. కరకట్టపై ఇల్లు మునిగిపోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్‌కు మకాం మార్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన కట్టు కథలను ప్రజలు నమ్మలేదు కనుకనే వైసీపీకి పట్టం కట్టారన్నారు. సీఎం జగన్‌కు అమెరికాలో ప్రజలు బ్రహ్మరథం పట్టి విశేషంగా ఆదరిస్తున్నారని, అయితే పని లేకుండా చంద్రబాబు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు.