ఆంధ్రప్రదేశ్‌

ఆర్టికల్ 370 రద్దుతో దేశమంతటా సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: దేశానికి ఈ ఆగస్టు నెలలో రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకునే అవకాశం వచ్చిందని, జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుతో యావత్ దేశంలో ప్రజలు, కశ్మీర్ వాసులు సంబరాలు జరుపుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఇది కేవలం మోదీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. విజయవాడ శివారు పోరంకి ఎస్‌టీబీఎల్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 70 సంవత్సరాలుగా కాశ్మీర్‌ను ఎడతెగని సమస్యగా చూపుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వారికి మద్దతునిచ్చే పార్టీలకు ఆగస్టు 6న పార్లమెంట్ సాక్షిగా వెలువబడిన తీర్పు ఆయా పార్టీలకు చెంపపెట్టు అని కన్నా అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన సంఘటనా పర్వ్ 2019 పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 20తో ముగుస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం మొదలై బీజేపీ కుటుంబంలో లక్షలాదిగా సభ్యులయ్యారన్నారు. తరువాతి కార్యాచరణ బూత్ లెవల్ ఏజెంట్లు, డివిజన్ అధ్యక్షుడు, మండల, నగర, జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.
అతిథిగా కర్నాటక చిక్‌మగళూరు ఎమ్మెల్యే సీటీ రవి మాట్లాడుతూ ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అధిక ప్రాధాన్యం కర్నాటలో మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లోపు తెలుగు రాష్ట్రాల్లో దిశా దిశా నిర్దేశికుల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎస్ మాధవ్, మాజీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్‌చార్జి తురగా నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, ప్రధాన కార్యదర్శులు సురేష్‌రెడ్డి, వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.
చిత్రం...బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న చిక్‌మగళూరు ఎమ్మెల్యే రవి