ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: గత రెండు రోజులుగా కృష్ణానది పరి వాహక ప్రాంతాన్ని వణికించిన వరద ప్రవాహం శనివారం కొంచెం తగ్గుముఖం పట్టడంతో అటు తీవ్ర ప్రాంత ప్రజలు ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ మరో రెండు రోజులపాటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని శనివారం తీర ప్రాంతంలో పర్యటించిన మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఆదేశించారు. ఈ రెండు రోజులపాటు సహాయక పునరావాస శిబిరాలు కొనసాగేలా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తగు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 7.40 లక్షల క్యూసెక్కుల వరద నీరు నేరుగా సముద్రంలోకి వెళుతోంది. ప్రకాశం బ్యారేజీపై ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఊహించని రీతిలో ఒక్కసారిగా 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. దాదాపు 15వేల మందిని వివిధ ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. కృష్ణాలో 15వేల ఎకరాల్లో వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వరద నీరు వెళ్లిన పంట నష్టంపై పూర్తిగా అంచనాలు వేయగలమన్నారు. గత ప్రభుత్వాలకు ఫ్లడ్ మేనేజ్‌మెంట్ తెలియదంటూ 1998లో ఒకేసారి ఫ్లడ్స్ వస్తే శ్రీశైలం పవర్ ప్రాజెక్టును ముంచివేసారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ఘోర పరాజయం తరువాత తండ్రీకొడుకులకు మతిచలించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బాధితులందరినీ ఆదుకుంటామని మంత్రి బొత్స అన్నారు. కంచికరచర్ల మండలం చెవిటికల్లులో పడవ ప్రమాదంలో మృతి చెందిన బాలిక కంచర్ల తులసీ ప్రియ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం అందిస్తామని మంత్రులు పేర్ని, కొడాలి, వెలంపల్లి తెలిపారు.

చిత్రం... విజయవాడ వద్ద నిండుగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ