ఆంధ్రప్రదేశ్‌

నాపై కక్షతో పేదలు కష్టాలపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష సాధించేందుకు రాష్ట్రానికి నష్టం వాటిల్లే విధంగా, పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దశాబ్ద కాలం తరువాత కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తిందని, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలను దాటి రాష్ట్రానికి వరద ఉద్ధృతి వస్తుందని తెలిసినా నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. తనపై కక్ష సాధించే క్రమంలో భాగంగా లక్షలాది మంది ప్రజలను వరదల్లో ముంచేశారని, వారిని కట్టుబట్టలతో నిరాశ్రయులను చేశారన్నారు. వరద తీవ్రత అంచనాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఎక్కడెక్కడ వరద ఎంత వస్తే ఏం చేయాలో స్పష్టమైన వ్యూహం లేదని, ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లలో మొన్నటి వరకు ఏ మేరకు నీటి నిల్వ ఉంది, పై నుండి ఎంత వరదనీరు వస్తుంది, ఏ మేరకు నీటిని దిగువకు వదలాలి అనే అంశంపై మంత్రులకు స్పష్టత లేదన్నారు. వరద నియంత్రణను వదిలేసి నా నివాసాన్ని టార్గెట్ చేయడమే వైసీపీ నేతల లక్ష్యంగా ఉందన్నారు. వరదకు రాజధాని కూడా మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారన్నారు. మాజీ సీఎం ఇంటిలోకి నీరు చేరాయని చూపడం కోసం లక్షలాది కుటుంబాలతో ఆడుకోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమన్నారు. కృష్ణకు వరదలు వస్తే సీఎం జగన్ అమెరికా వెళ్లారని, గోదావరి వరదలు వస్తే జరుసలేమ్ పర్యటనకు వెళ్లారని, ఆయనకు పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ లేదనడానికి ఈ పర్యటనలే నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వమే టెర్రరిజం చేస్తుందని మోహన్‌దాస్ పాయ్ చెప్పారని, ప్రభుత్వ టెర్రరిజంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరించాయని, ప్రపంచదేశాల్లో పలు దేశాలు ఏపీకి దూరమయ్యాయన్నారు. తిత్లీ, హుదూద్ విపత్తులు సంభవించినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను ఆదుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని, పునరావాస శిబిరాలు ఏర్పాటుచేసి బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.