ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి కరుణించడంతో ప్రాజెక్టులు నిండాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: రాష్ట్రంలోని ప్రజలు ఐదేళ్లుగా కరవుకాటకాలతో నానా ఇబ్బందులు పడ్డారని, దశాబ్దకాలం తర్వాత కృష్ణానదికి వరద రావడంతో రాష్ట్రానికి కలకళ వచ్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా ఉండాలంటే కృష్ణానది గర్భంలోని అక్రమకట్టడాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజావేదికలో జరిగిన ముఖ్య సమావేశంలోనే బాబు నివాసం అక్రమ కట్టడమని, వరద ముంపు పొంచి ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారని, అది నేడు నిజమైందన్నారు. రాష్టమ్రంతా జలకళ రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉంటే ఒక కుటుంబం మాత్రం బాధపడుతోందని దుయ్యబట్టారు. వరదలు వచ్చినప్పుడు ప్రమాదం కూడా కొంతస్థాయిలో ఉంటుందని, ఇది తెలిసే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఈ దృష్ట్యా వరదలను చిత్రీకరించేందుకు చర్యలు చేపటితే నా ఇంటిపై డ్రోన్ ఎగిరింది, ఇదేంటి నేను హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు.