ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు అగచాట్లు పడుతుంటే కరకట్ట చుట్టూ తిరుగుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: వరదలు వచ్చి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటే, నిరాశ్రయులను ఆదుకోకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు కృష్ణా కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, కరకట్టపై ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా, లేదా అంటూ డ్రోన్‌లు ఎగురవేసి చూడటం మంత్రుల బాధ్యతా అని ప్రశ్నించారు.
కరకట్టపై మాజీ ఎంపీ గోకరాజు గెస్ట్‌హౌస్, అదే వరుసలో మాజీ సీఎం చంద్రబాబు నివాసంతో పాటు ప్రముఖుల గృహాలు, శారదాపీఠం కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లిన ఆశ్రమం ఉందన్నారు. వరద ఉద్ధృతి పెరిగితే అన్నీ మునుగుతాయని, డ్రోన్ రాజకీయాలు అవసరం లేదన్నారు. రాజకీయాలు, కక్ష సాధింపులేవైనా ఉంటే ఇది సరైన సమయం లేదని, విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని జనసేన కోరుకుంటుందని, జగన్‌పై విమానాశ్రయంలో జరిగిన దాడిపై జనసేన స్పందిస్తూ ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని సూచించిందన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి బాధితులు, రైతులను ఆదుకోవాలని కోరారు.