ఆంధ్రప్రదేశ్‌

వరద ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం కృష్ణానది వరద ముంపు ప్రాంతాలను ప్రత్యేక హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. కాకినాడలోని జేఎన్టీయు స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఆయన ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. మార్గంమధ్యలో విజయవాడ పరిసరాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రదేశాలను, వివిధ గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయ, పునరావాస చర్యలపై గవర్నర్ హరిచందన్ వాకబు చేశారు.
చిత్రం... కృష్ణానది వరద పరిస్థితిని పరిశీలిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్