ఆంధ్రప్రదేశ్‌

103 జీవోను తక్షణం రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలకు, 2005లో జారీ అయిన 90 నంబర్ జీవోకు విరుద్ధంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లారుూస్ అసోసియేషన్‌కు గుర్తింపునిస్తూ జారీ అయిన 103 జీవోను తక్షణం రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎన్జీవో హోంలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ హయాంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి గుర్తింపు ఇవ్వాలంటే విధిగా ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్ట్ఫా కౌన్సిల్ కమిటీలో చర్చించాల్సి ఉండేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఆ నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక సంఘాలు గుర్తింపు కోసం చేసుకున్న దరఖాస్తులు అనేకం పెండింగ్‌లో ఉండగా, వాటిని కనీసం పరిశీలించకుండా జూన్‌లో దరఖాస్తు చేసుకున్న సంఘానికి ఎలా గుర్తింపునిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఈ నెల 19వ తేదీ జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.