ఆంధ్రప్రదేశ్‌

కొత్త మద్యం విధానం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: దశల వారీగా మధ్య నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేసే చర్యల్లో భాగంగా కొత్త మద్యం విధానాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషనే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 3500 దుకాణాల మాత్రమే ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అక్టోబర్ నుంచి కొత్త మద్య విధానం అమల్లోకి రానుంది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, మండలాల పరిధిలో ఎనె్నన్ని దుకాణాలు ఉండాలన్న అంశాన్ని ఆబ్కారీ శాఖ కమిషనర్ నిర్ణయించనున్నారు. ఆబ్కారీ చట్టం (1968) ప్రకారం దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తారు. ఒక్కో దుకాణం 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి. రోడ్డును ఆనుకుని పక్కా భవనంలో కింది అంతస్తులోనే దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దుకాణంలో కావాల్సిన ఫ్యాన్లు, కుర్చీలు, టేబుళ్లు, నీటి కూలర్, గరిష్ట ధరను తెలిపే బోర్డు వంటివి ఏర్పాటు చేస్తారు. దుకాణం ముందు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ రిటైల్ ఔట్‌లెట్- నెంబర్‌తో సైన్ బోర్డును
తెలుగు, ఇంగ్లీషులో ఏర్పాటు చేస్తారు. క్యాష్ చెస్టు, నకిలీ నోట్ల గుర్తింపు పరికరం, సీసీ కెమెరాలు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. వారం రోజుల నోటిఫిషన్ ద్వారా అద్దెకు తీసుకునే దుకాణాన్ని ఖరారు చేస్తారు. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ దుకాణాల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ప్రతి దుకాణంలో పట్టణ ప్రాంతాల్లో 5 మంది, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బంది ఉంటారు. ఒక సూపర్‌వైజర్, నలుగురు లేదా ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. సూపర్‌వైజర్‌కు 17,500 రూపాయలు, సేల్స్‌మెన్‌కు 15 వేల రూపాయలు వేతనం చెల్లిస్తారు. సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు. సూపర్‌వైజర్, సేల్స్‌మెన్‌కు వయస్సు, చదువుకు సంబంధించి అర్హతను కూడా నిర్ణయించింది. జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లను సిబ్బంది నియామకాల్లో అమలు చేస్తారు. సిబ్బంది నియామకం ఒక సంవత్సరానికి మాత్రమే పరిమితం చేసింది. సిబ్బంది నియామకానికి సంబంధించి మరో కమిటీని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తారు. దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తెరచి ఉంచుతారు. మద్యం రవాణా చార్జీలను ఖరారు చేసేందుకు మరో కమిటీని నియమించింది.