ఆంధ్రప్రదేశ్‌

వరద ప్రవాహాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: వరద ప్రవాహాల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బాధితులను ఆదుకునేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, టీడీఎల్‌పి నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో కరకట్ట వద్దనున్న తన నివాసంపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంపై నెలకొన్న తాజా పరిస్థితులు, వరద ఉద్ధృతి, సహాయక చర్యలపై మాట్లాడారు. వరదనీటి నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కేవలం నీళ్లు వెనక్కి తన్నడం కోసమే ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లు అడ్డం పెట్టినట్లు తెలుస్తోందని, తన నివాసంలోకి వరదనీరు ప్రవేశించింది అని చెప్పడానికే వైసీపీ నేతలు ఈ తరహా కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. సక్రమంగా వరద నిర్వహణ చేస్తే ఈ పరిస్థితులు తలెత్తేవి కాదని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో సంభవిస్తున్న వరదలు, ముంపు ప్రాంతాలు, ప్రజల బాగోగులపై ఒక్క సమీక్ష కూడా చేయని పరిస్థితి ఉందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా సంభవించిన వరదలతో మన రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకున్న వెంటనే వరదనీటిని వదిలితే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. తనపై ద్వేషంతో వరదలతో వైసీపీ నేతలు ఆటలాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విరుచుకుపడ్డారు. నీళ్లు నిల్వబెట్టి అకస్మాత్తుగా విడుదల చేసి ఇక్కడి ఇళ్లు మునిగాయని చూపేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు. హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాలని చెప్పింది ఎవరో, దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నాయకులతో అన్నారు. కోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా భద్రతతో చెలగాటాలాడుతూ న్యాయ వ్యవస్థను అగౌరవపర్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. డ్రోన్‌ల ద్వారా చిత్రీకరించాల్సిందిగా సీఎం ఇంటి నుంచి కిరణ్ అనే వ్యక్తి పంపాడని పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు స్పష్టంగా చెప్తుంటే, పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. టీడీపీ కార్యకర్తలపై జరిగిన లాఠీఛార్జిని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు. చేతగాని పాలనతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం పరువుతీస్తూ చేటు వాటిల్లేందుకు తావిస్తోందని చంద్రబాబు విమర్శించారు.