ఆంధ్రప్రదేశ్‌

వరదపై టీడీపీ రాద్ధాంతం : నాగిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 16: రాష్ట్రంలో ఎన్నడూలేనంతగా నదులు ఉప్పొంగి వరదలతో జలాశయాలు కళకళలాడుతుంటే టీడీపీ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని రైతుమిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వరద నీటి ఉధృతి కారణంగా కరకట్ట దిగువన పరిస్థితి ఎలా ఉందో అని ప్రభుత్వం అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తుంటే నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన ప్రతిపక్షం ఆందోళనకు దిగటం హేయమన్నారు. వరద పరిస్థితులను సమీక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా ప్రభుత్వంతో కలసి వరద నియంత్రణ చర్యలకు సహకరించాలని హితవు పలికారు. 2009 అక్టోబర్‌లో ప్రకాశం బ్యారేజీ దిగువకు అత్యధికంగా 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని ఆ సందర్భంలో అనేక చోట్ల గండ్లు కూడా పడ్డాయని గుర్తుచేశారు. ప్రస్తుతం పులిచింతల నుంచి దిగువన ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తోందని ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున డ్రోన్ల వినియోగంతో ఇరిగేషన్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తుంటే అదేదో తప్పు జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేయటాన్ని ప్రజలు నమ్మరన్నారు. అక్రమ కట్టడాల్లో ఉంటున్న వారు ఖాళీ చేస్తే మంచిదని హితవు పలికారు.