ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 13: పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్ల అమలుకు వీలుగా నైపుణ్యమున్న మానవ వనరులను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల కోసం 25 ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించే ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక రిజర్వేషన్లు అమలు చేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న అత్యున్నత పారదర్శక విధానాలను పారిశ్రామిక వర్గాలకు వివరించాలని అధికారులకు నిర్దేశించారు. పోర్టులు, విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు తదితర బీఓటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలని పెట్టుబడులను ఆకర్షించ గలిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్ట్‌లకు గ్లోబల్ టెండర్లు వేసి తక్కువ ఖర్చులో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తేవాలన్నారు. ఇజ్రాయెల్‌లో డీ శాలినేషన్ వాటర్‌ను వినియోగిస్తున్నారని ఒక రూపాయకి తాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. రూ. 2కే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని గత ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను వంచించారని విమర్శించారు. పరిశ్రమలకు అనుమతిచ్చే విషయంలో కాలుష్యాన్ని గుర్తించి నియంత్రించాలన్నారు. విష పదార్థాలను వెదజల్లుతున్నాయా లేదా అనేది గుర్తించాలన్నారు. ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంలో కేవలం తక్కువ మొత్తంలోనే శుద్ధి చేస్తున్నారని మిగిలిన కాలుష్యం గాలిలో కలుస్తోందని వివరించారు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్ల రాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీరప్రాంతమంతా కాలుష్యంతో నిండి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో సముద్ర జలాలు చూస్తే ఎంతటి కాలుష్యం ఉందో అర్థమవుతుందన్నారు. దీనికి భయపడి అనేక దేశాలు పరిశ్రమలకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. కాలుష్యం పట్ల కఠినంగా వ్యవహరించక పోతే భావితరాలకు ఇబ్బందులు తప్పవన్నారు. పొల్యూషన్ బోర్డ్ నిరభ్యంతరం అని చెబితేనే పరిశ్రమలకు అనుమతివ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమలకిచ్చే రాయితీలు రూ. 2వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2015-16 నుంచి ఇండస్ట్రియల్ ఇనె్సంటివ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంకులు వచ్చాయన్నారు. ప్రోత్సాహకాలు ఇస్తూనే మరోవైపు పెట్టుబడులు పెట్టండని అంటున్నాం.. ఇలాంటి బకాయిలు పెండింగ్‌లో ఉంటే ఏ రకంగా పరిశ్రమలు వస్తాయన్నారు. గత ప్రభుత్వం ప్రతి దేశంలో తిరిగి ఏం సాధించిందని నిలదీశారు. మునిసిపాలిటీలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్ వినియోగించి పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
మహిళలకు మరింత ఆదాయం
మహిళలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లలో రూ. 75వేలు వైఎస్సార్ చేయూత కింద అందిస్తామని ప్రకటించారు. ఆసరా కింద మహిళలను ఆదుకుంటామన్నారు. ఈ డబ్బు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏపీఎస్ ఆర్టీసీ లాభదాయక సంస్థగా మారాలన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలన్నారు. డీజిల్ రూపంలో ఉన్న భారాన్ని తొలగించాలన్నారు. బకింగ్‌హాం కెనాల్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకు రావాలని దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ ఏ రకమైన పంటలు పండుతున్నాయి. ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే అంశాలను విశే్లషించాలన్నారు. మండలాల వారీగా కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆక్వా ప్రాంతాలపై దృష్టి సారించి కల్తీ ఫీడ్, విత్తనాలు లేకుండా నియంత్రించాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

చిత్రం...పరిశ్రమల శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి