ఆంధ్రప్రదేశ్‌

ఇక మహిళా పోలీసు వలంటీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 23: మహిళా పోలీసు వలంటీర్లు రానున్నారు. ప్రతీ గ్రామానికి పది మందిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో చురుగ్గా ఉన్న మహిళలను ఎంపికచేసి గ్రామాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిపై కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో పరువుపోతుందని భయపడి బయటకు రాని ఎన్నో అంశాలకు పరిష్కారాలు, బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మహిళా పోలీసు వలంటీర్ల ఎంపిక నుంచి విధులు ఎలా నిర్వహించాలనే దానిపై కూడ నిబంధనలు జారీచేసినట్లు తెలిసింది. ఎ రాజకీయ పార్టీకి చెందని వారిని మాత్రమే వలంటీర్లుగా తీసుకోవాల్సి ఉంటోంది. ఈ వలంటీర్లు గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై , మహిళల పై దాడులు, చిన్నారులపై వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, భార్యభర్తల మధ్య వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, వరకట్న వేధింపులు, పరువు హత్యలు, మద్యం బెల్టు దుకాణాల నిర్వహణ తదితర అంశాలపై నిఘా పెట్టనున్నారు. ప్రతీ శనివారం గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సమావేశం నిర్వహిస్తారు. అక్కడ ప్రజల సంతకాలు సేకరించి, వారు చెప్పిన ఫిర్యాదులను నమోదు చేస్తారు. అదేవిధంగా గ్రామాల్లో సేకరించిన విషయాలను ప్రజలకు నిరంతరం తెలియచేస్తూ అవగాహన కల్పిస్తారు. అనంతరం ప్రతీ పక్షం రోజులకు ఒక మారు నోడల్ అధికారి గ్రామాల్లో గుర్తించిన సమస్యలపై సమీక్షిస్తారు. కొన్ని ఫిర్యాదులు స్టేషన్ వరకు వెళ్ళకుండా రచ్చబండ లేదా పెద్దల సమక్షంలోనే జరిమానా విధిస్తూ ఆగిపోయేలాచేస్తారు. ఈ విషయాల ఆధారంగా ఎస్పీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ పోలీసు బలగాలు అవసరమో, చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నది నిర్ధారణకు వచ్చి తక్షణ చర్యలు తీసుకుంటారు. మహిళా పోలీసు వలంటీర్లకు సుమారు రూ.1000 గౌరవవేతనం అందచేసే అవకాశం కూడా ఉంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం అందివ్వనుంది.