ఆంధ్రప్రదేశ్‌

పొగాకు రైతులకు సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 20: రైతులు సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన సాగుపై దృష్టి సారించాలని, ఆ దిశగా పొగాకు రైతులకు ఐఎస్‌టీఎస్ సహకరిస్తుందని ఐఎస్‌టీఎస్ (ఇండియన్ సొసైటీ ఆఫ్ టుబాకో సైన్స్) సలహాదారు, బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ శివణ్ణ్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు సీటీఆర్‌ఐ, గుంటూరు పొగాకు బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో మోరంపూడి గాదాలమ్మనగర్ బీవీఆర్ శ్రీ కనె్వన్షన్‌లో నిర్వహించిన పొగాకు జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది.
ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ వీసీ డాక్టర్ శివణ్ణ్ మాట్లాడుతూ పొగాకు పంటలో ఉత్తమ, నాణ్యమైన పద్ధతులు, మెళకువలు పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నారం డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, సీటీఆర్‌ఐ రాజమహేంద్రవరం శాస్తవ్రేత్త డాక్టర్ సరళ, డాక్టర్ హెచ్‌ఆర్ పటేల్, డాక్టర్ యు శ్రీ్ధర్, డాక్టర్ నర్శింహారాయ్, డాక్టర్ సయ్యద్ మహమ్మద్ పొగాకు సాగుపై శాస్ర్తియ ప్రసంగాలు చేశారు. పొగాకు సాగులో ప్రత్యామ్నాయ పంటల్లో అవలంభించే విధానాలు, వాతావరణం మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై శాస్తవ్రేత్తలు సూచనలు చేశారు.