ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులపై చర్చ జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: చట్టాలను పక్కనబెట్టి రాష్ట్రంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన 23 మంది వైకాపా సభ్యుల పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని, అలా జరుగని పక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ శాసనసభ జీరో అవర్‌లో గిద్దలూరు వైకాపా శాసనసభ్యుడు అన్నా రాంబాబు చేసిన ప్రకటన టీడీపీ సభ్యులను కంగు తినిపించింది. నేడు సభలో నీతులు వల్లిస్తున్న చంద్రబాబు నాడు 23 మంది వైకాపా సభ్యులను ఎలా కొనుగోలు చేసారని రాంబాబు ప్రశ్నించారు. ఆయన పద్ధతి, తీరు నచ్చకనే తాను ఆ పార్టీకి రాజీనామా చేసానన్నారు. ఫిరాయింపుదారులపై చర్య తీసుకోవాలంటూ గతంలో ఓ మాజీ ఎమ్మెల్యేగా నాటి స్పీకర్‌కు ఎన్నో లేఖలు రాసానని, అయితే ఎలాంటి చర్య లేదన్నారు. దీనికి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కూడా మద్దతు పలికారు. స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ ఈ విషయమై సభా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం, దారుణమన్నారు. ఏది ఏమైనా సభలో చర్చ జరగాల్సిందేనన్నారు. దేశం మొత్తానికి తెలిసి వచ్చేలా తగు చర్యలు చేపట్టాల్సిందేనని స్పీకర్ చెప్పగా అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.