రాష్ట్రీయం

పీపీఏల్లో లెక్కలేనన్ని కుంభ‘కోణాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూలై 19: గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరిగిన ఒప్పందాల్లో దారుణాతి దారుణమైన కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల(పీపీఏ)పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చకు సీఎం వైఎస్ జగన్ సమాధానం చెబుతూ అందుబాటులో ఉన్న థర్మల్ విద్యుత్‌ను పక్కన పెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక ధరలకు సంప్రదాయేతర విద్యుత్తును కొనుగోలు చేశారన్నారు. కేవలం 3 సంస్థలతోనే 63 శాతం ఒప్పందాలను 25 ఏళ్లకు చేసుకోవడం ద్వారా డిస్కంలపై కోలుకొని విధంగా ఆర్థిక భారాన్ని మోపారన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అంతులేని అవినీతిగా తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చేసుకున్న పీపీఏల కారణంగా ఏడా రూ.2766 కోట్ల నష్టం వస్తుందన్నారు. పీపీఏలను సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించిందని, ప్రస్తుతం కమిటీ సభ్యులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఒక వైపు విచారణ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు మాత్రం తనలో ఉన్న అక్కసు, ఆక్రోశం, ఆవేశాన్ని అధికారులపై వెళ్లగక్కుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థ (సీఈఆర్‌సీ) నిర్దేశిస్తున్న రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ (ఆర్‌పీఓ)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(ఏపీఈఆర్‌సీ) అనుసరించదని, ఈ విషయం సీఎంగా పని చేసిన వ్యక్తికి తప్పకుండా తెలిసి ఉండాలన్నారు. ఏటా ఏపీఈఆర్‌సీ కొన్ని మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని, ఆ మేరకు మాత్రమే విద్యుత్ కొనుగోలును నిర్దేశిస్తుందన్నారు. కానీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏపీఈఆర్‌సీ నిర్దేశించిన దానిని కాదని అత్యధిక శాతం కొనుగోలు గత ప్రభుత్వం చేసిందన్నారు. 2015-16లో 5 శాతం ఆరీపీఓ ఉండాలని ఏపీఈఆర్‌సీ నిర్దేశిస్తే అప్పటి ప్రభుత్వం మాత్రం 5.59 శాతం వరకు కొనుగోలు చేసిందన్నారు. 2016-17 సంవత్సరంలో 5 శాతానికి బదులు 8.6 శాతం, 2017-18లో 9 శాతానికి బదులు 19 శాతం కొనుగోలు చేసిన
ప్రభుత్వం తన దోపిడీని కొనసాగిస్తూ 2018-19 సంవత్సరంలో 11 శాతం మాత్రమే కొనుగోలుకు ఆర్‌పీఓను ఏపీఈఆర్‌సీ నిర్దేశిస్తే ఎకంగా 23.4 శాతం కొనుగోలు చేసిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కువ విద్యుత్, ఎక్కువ ధరను చెల్లించిన కారణంగా మూడేళ్లలోనే రూ.2653 కోట్లు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఇక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న థర్మల్ విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్ కన్నా తక్కువ ధరకు లభిస్తున్నా దానిని పక్కన పెట్టి మరీ కొనుగోలు చేశారని ఆరోపించారు. థర్మల్ పవర్ యూనిట్ ధర రూ.4.20 కే అందుబాటులో ఉంటే అదికాదని పవన విద్యుత్‌ను ఒక్కో యూనిట్‌కు రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు. థర్మల్ పవర్ కాదని, పవన విద్యుత్ కొనుగోలు చేయడం వలన, కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం థర్మల్ పవర్ కొన్నా, కొనకపోయినా యూనిట్‌కు రూ.1.10 చొప్పున కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చిందన్నారు. దీని కారణంగా పవన విద్యుత్ ఒక్కో యూనిట్ రూ.4.84తో పాటు థర్మల్ పవర్ కొననందుకు ఒక్కో యూనిట్‌కు చెల్లించిన రూ.1.10 వలన మొత్తం పవన్ విద్యుత్ ఒక్కో యూనిట్ ధర ఏకంగా రూ.5.94కు చేరిందన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. థర్మల్ విద్యుత్ మనకు కావాల్సినంత అందుబాటులో ఉన్నా పవన, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడం కారణంగా ఒక్కో యూనిట్‌పై రూ.1.74 అదనంగా చెల్లించినట్లైయిందన్నారు. దీని కారణంగా ప్రతీ ఏటా ప్రభుత్వంపై రూ.2766 కోట్లు భారం పడిందన్నారు. నిజానికి ఇది ఒక విధమైన కుంభకోణమేనని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్తో పొల్చి చూస్తే ఏటా రూ.3831 కోట్లు ఎక్కువ చెల్లించినట్లు అవుతుందన్నారు. పవన్ విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అప్పటి ప్రభుత్వం అత్యధికంగా 63 శాతం కేవలం మూడు కంపెనీలతో మాత్రమే ఒప్పందం కుదుర్చుకుందన్న ఆయన గ్రీన్‌కో, రెన్యూ, మిత్రా కంపెనీలతో మాత్రమే పెద్ద స్థాయిలో వీరి దోపిడీ కొనసాగిందన్నారు. చంద్రబాబు చెప్పిన విధంగా ఆర్‌పీఓ లిమిట్స్ పవర్ అబ్లిగేషన్, ఔట్‌సైడ్ రెన్యువల్ పవర్ అబ్లిగేషన్ రెండు కలిపితే ఒక్కో యూనిట్‌కు రూ.1.74 చొప్పన ఎక్కువ చెల్లించారని దీని ప్రకారం రూ.2766 కోట్లు ఎక్కువ మొత్తం చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు. గడిచిన మూడేళ్లలోనే రూ.5497 కోట్లు విద్యుత్ కొనుగోలులో అదనంగా చెల్లించారంటే ఏ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందో రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడం వలన కేంద్రం ఒక్కో యూనిట్‌కు రూ.1.54 రాయితీ ఇస్తుందని కానీ 2016-17 సంవత్సరంలో కేంద్రం నుండి ఒక్క రూపాయి రాయితీ కూడా రాలేదన్నారు. 2017 - 18 సంవత్సరంలో రూ.220 కోట్లు, 2018-19లో రూ.320 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించిందన్నారు. మూడు సంవత్సరాల్లో అధిక ధరలు చెల్లించి రూ.5497 కోట్లు నష్టపోతే కేంద్రం నుంచి మాత్రం అత్యల్పంగా ఇనె్సటివ్స్ వచ్చాయన్నారు. దీని కారణంగా వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని దీన్ని భరించడం ఎంత కష్టమో కొంచెమైనా అలోచన చేయలేదన్నారు. టెక్నాలజీ కారణంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయని పదే పదే చెబుతున్న చంద్రబాబు మరీ పీపీఏలను ఎందుకు 25 సంవత్సరాలకు చేశారన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ధరలు తగ్గుతాయని తెలిసి ఏకంగా 25 ఏళ్ల కోసం పీపీఏలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఇది ఎంత వరకు ధర్మమో చెప్పాలన్నారు. దీని ప్రకారం ఏటా రూ.2766 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు మనం నష్టపోతున్నట్లు కాదా అని ప్రశ్నించారు. ఇది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ధరతో పోల్చి చెబుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ధరలతో పొల్చి చూస్తే దాదాపు రూ. 4 వేల కోట్లు నష్టం వస్తుందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే పని చేశారన్నారు. తాను కోరుకున్న వ్యక్తిని ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా నియమించేందుకు చట్టసవరణ చేసి మరీ ఏపీఈఆర్‌సీ చైర్మన్ వయస్సును 65 నుండి నిబంధనలను సవరించి 70 ఏళ్లకు పెంచారన్నారు. కుంభకోణాలు చేసేందుకు ఏకంగా చట్టాలనే మార్చడం ధర్మమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌లోకి తీసుకు వచ్చేందుకు అనేక సంస్కరణలు చేశారని చెబుతున్న బాబు మాటల్లో వాస్తవం లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటోందన్నారు. ఇదే విషయాన్ని ఏటా ప్రభుత్వం ఏపీఈఆర్‌సీకి నివేదించిందన్నారు. 2015 నుండి రాష్ట్రంలో ప్రతీ ఏటా మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ విద్యుత్‌ను కొనుగోలు చేశారన్నారు. మిగులు విద్యుత్ ఉన్న సమయంలో పీపీఏలపై ఎందుకు సంతకాలు చేశారని గట్టిగా నిలదీశారు. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పారిశ్రామిక రంగం నుంచి క్రమంగా తగ్గుతోందన్నారు. అది 2014 -15లో 25.48 శాతం కాగా, 2017-18 నాటికి 22.09కి పడిపోయిందన్నారు. పారిశ్రామిక రంగం కుదేలవుతుందన్న విషయం దీని ద్వారా స్పష్టమైయ్యిందన్నారు. ఒక వైపుప్రోత్సహకాలు లేవు, మరోవైపు అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం, దీని ద్వారా పరిశ్రమలకు అధిక ధరకు విద్యుత్‌ను అందించామన్నారు. తద్వారా పారిశ్రామిక రంగం నానాటికీ పతనమవమవుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న డిస్కమ్‌లలో ఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌లలో ఎస్‌పీడీసీఎల్ ద్వారా అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో 2015 -16లో కాస్ట్ ఆఫ్ పవర్ ఆపరేషన్స్ విద్యుత్ కొనుగోలు మొత్తం రూ.14,920 కోట్లు కాగా, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్(అన్ని రకాలుగా ఆదాయం) కేవలం రూ.11920 కోట్లు మాత్రమేనన్నారు. అదే 2016 - 17లో కొనుగోలు రూ. 15076 కోట్లు కాగా రెవెన్యూ మాత్రం రూ.12,157 కోట్లు వచ్చాయన్నారు. ఏడాది తరువాత 2017 -18లో కొనుగోలు కోసం రూ.16,642 కోట్లు వెచ్చించగా, వచ్చిన ఆదాయం రూ. 13,609 కోట్లుగా ఉందన్నారు. 2018 - 19లో కొనుగోలు మొత్తం రూ. 19,139 కోట్లు కాగా రెవెన్యూ మాత్రం రూ.14956 కోట్లు మాత్రమేనన్నారు. ఈ పరిస్థితిని బట్టి డిస్కమ్‌లు నష్టాల బాటలో పడి మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. డిస్కమ్‌లు మనుగడ సాధించాలంటే ప్రభుత్వం ప్రతీ ఏటా సబ్సిడీ పెంచాల్సి వస్తుందన్నారు. 2015 - 16లో రూ.2318 కోట్లు, 2016-17 రూ.3153 కోట్లు, 2017 -18లో రూ.4167 కోట్లు, 2018 - 19లో రూ. 4937 కోట్లు చొప్పున ప్రభుత్వం సబ్సిడీలను డిస్కమ్‌లకు చెల్లించిందన్నారు. ఈ స్థాయిలో సబ్సిడీ భరించే స్థితిలో రాష్ట్రం ఉందా అనే విషయంపై అందరూ ఆలోచించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెవెన్యూ లోటు ప్రతీ ఏటా పెరుగుతూనే ఉందన్నారు. ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా రూ.66,361 కోట్లకు చేరిందని సీఎం జగన్ గణాంకాలను వివరించారు. గత ప్రభుత్వంలోని పెద్దలు మనుషుల స్థాయి దాటిపోయి రాక్షసులుగా మారారనిపిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు.