ఆంధ్రప్రదేశ్‌

రైతుల ఆదాయం పెంచే పరిశోధనలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 19: దేశంలో రోజు రోజుకూ వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోతున్నందున, ఉన్న క్షేత్రాల్లోనే ఉత్పాదకత పెరిగి, రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా పరిశోధనలు జరగాలని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్-్ఛన్సలర్ శివణ్ణ్ సూచించారు. ఇందుకు 2022 లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా బలపడని పక్షంలో భవిష్యత్తులో వ్యవసాయం చేసేవారు కరవవుతారన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టుబాకో సైన్స్ (ఐఎస్‌టిఎస్) ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సును ముఖ్య అతిథిగా పాల్గొన్న శివణ్ణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వ్యవసాయ ఉత్పత్తికైనా మార్కెట్ వసతులు మెరుగుపడాలని, గిట్టుబాటు ధర ఉండాలని, అంతిమంగా రైతులు ఆర్థికంగా బలపడాలన్నారు. రైతులను అడ్డుపెట్టుకుని దళారులు బాగుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రైతుల సమస్యలపై ఇచ్చిన నివేదిక అమలువిధానం సక్రమంగా లేదన్నారు. దేశంలో 130 కోట్ల మందికి ఆహార ఉత్పత్తులు అందించే వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోతున్నాయన్నారు. వ్యవసాయానికి భూమి లేని స్థితి దాపురిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలు, పట్టణీకరణ వల్ల 72 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోయాయని, అందుకే ఉన్న భూమిలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అనే్వషించే దిశగా శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేయాలన్నారు. దీని కోసం పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. రైతు పండించకుండా ఆహారం రాదని, రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో అధ్యయనం చేయాలన్నారు. మూడేళ్లకొకసారి నిర్వహిస్తున్న సదస్సుల్లో చేసిన సిఫార్సుల్లో ఎంత వరకు అమలవుతున్నాయో కూడా పరిశీలన జరగాలన్నారు. సిఫార్సులపై పునఃస్సమీక్ష కూడా చాలా అవసరమన్నారు. పొగాకు విస్తరణ చాలా ముఖ్యమని, ఆ దిశగా పరిశోధనలు జరగాలన్నారు. పొగాకు రైతు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాడని, వాటిని అధిగమించే విధంగా పరిశోధనా ఫలితాలు యువ శాస్తవ్రేత్తలు అందించాలన్నారు. హానికరమైన పొగాకును నియంత్రించాల్సి ఉందన్నారు. పొగాకు నుంచి ప్రత్యామ్నాయ ఆదాయాన్ని కూడా సాధించాలని శివణ్ణ్ పేర్కొన్నారు. సదస్సులో ప్రధానంగా పొగాకు రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు అవసరమైన వ్యూహాలు, నాణ్యమైన పొగాకు ఉత్పత్తి, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. ముందుగా ఐఎస్‌టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పొగాకు శాస్తవ్రేత్తలు, రైతులు, విధాన నిర్ణేతలు, అధికారులు, పొగాకు పరిశ్రమ ప్రతినిధులు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ జి కృష్ణకుమార్ మాట్లాడుతూ పొగాకును నిరంతర ఆదాయాన్నిచ్చే పంటగా మార్చాల్సివుందన్నారు.
ఈసందర్భంగా సావనీర్, పరిశోధనల పుస్తకాలను సదస్సులో ఆవిష్కరించారు. సీటీఆర్‌ఐ డైరెక్టర్, ఐఎస్‌టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్ రెడ్డికి పరిశోధన అవార్డు ప్రధానం చేశారు. సీటీఆర్‌ఐ ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ సుబ్బయ్య స్వాగతం పలికిన సదస్సులో సీటీఆర్‌ఐ పూర్వ డైరెక్టర్ డాక్టర్ దేవ్‌సింగ్, దేశ వ్యాప్తంగా వివిధ పరిశోధనా కేంద్రాల నుంచి శాస్తవ్రేత్తలు, యువ శాస్తవ్రేత్తలు, పొగాకు రైతులు హాజరయ్యారు. ఐఎస్‌టీఎస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం ప్రభాకరరావు, యువ శాస్తవ్రేత్త కె ప్రభాకరరావు, డాక్టర్ లక్ష్మీనర్సయ్య, డాక్టర్ ఆర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ జి కృష్ణకుమార్ తదితరులు మాట్లాడారు. వివిధ పరిశోధనలకు సంబంధించి పలువురికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.