ఆంధ్రప్రదేశ్‌

వాల్తేర్ డివిజన్ రద్దు వెనుక రైల్వేబోర్డు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: రైల్వేబోర్డు అధికారులు కుట్రతోనే 125ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేశారని రైల్వే కార్మిక సంఘం ప్రతినిధి చలసాని గాంధీ ఆరోపించారు. విశాఖ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా ఈ విధంగా జరగలేదన్నారు. ప్రజా పోరాటంతోనే డివిజన్‌ను సాధించుకోవాలన్నారు. ఇందుకు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైల్వే కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికార పార్టీ నేతలు అంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఉద్యమం విజయవంతమవుతుందని, దీని ద్వారానే వాల్తేర్ డివిజన్‌ను కాపాడుకోగలమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి డివిజన్ సమస్యను వివరిస్తామని, వారి నుంచి సహకారం తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని కొత్త విధానాన్ని ఇక్కడ అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రి, కేంద్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని దీని గురించి తక్షణమే స్పందించి వాల్తేర్ డివిజన్‌తో కూడిన జోన్‌ను ఉండేలా చేయాలన్నారు. అపుడే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రెండు భారీ పోర్టులు, హెచ్‌పీసీఎల్, బీహెచ్‌ఈఎల్, హిందుస్థాన్ షిప్‌యార్డు, నేవల్ డాక్‌యార్డు, ఎన్‌ఎస్‌టీఎల్ వంటి పరిశ్రమలున్నాయని, వీటికి రైల్వే విశేషంగా సేవలందిస్తోందన్నారు. దేశంలోనే ఆదాయంలో అగ్రగామిగా నిలుస్తున్న అయిదింటిలో వాల్తేర్ డివిజన్ ప్రతిసారి రెండు, మూడు స్థానాల్లో నిలుస్తోందన్నారు. డివిజన్ లేకుండా చేయడం వలన దాదాపు 20 వేల మంది రైల్వేకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ప్రతి చిన్న విషయానికి విజయవాడ డివిజన్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుందన్నారు. కొత్త రైళ్ళు, లైన్లు రావాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగు పడాలన్నా డివిజన్ ఉండి తీరాలన్నారు.
కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పడటం మంచిదేనని, అయితే దాని వలన ఇక్కడి డివిజన్‌ను రద్దు చేయడమనేది సరైన నిర్ణయం కాదన్నారు. రైల్వేబోర్డు అధికారులు కుట్రతోనే డివిజన్‌ను తొలగించారన్నారు. కొత్త జోన్ ఏర్పడినా, డివిజన్ ఉన్నా ఒక్క పైసా కూడా అదనంగా వెచ్చించాల్సిన అవసరం ఉండదన్నారు. సమావేశంలో ప్రతినిధులు పీజేజే రాజు, బి.రాములు పాల్గొన్నారు.