ఆంధ్రప్రదేశ్‌

సభా సంప్రదాయాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 19: పెద్దల సభగా పిలిచే శాసనమండలి సంప్రదాయాలు పాటించి సభ సజావుగా జరిగేలా సహకరించాలని శాసన మండలి డెప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం మండలిలో బడ్జెట్‌పై జరిగిన లఘు చర్చలో పాల్గొనేందుకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు డిప్యూటీ చైర్మన్ చురకలంటించారు. టీడీపీ ఎమ్మెల్సీ పీ. ఆశోక్‌బాబు బడ్జెట్‌పై మాట్లాడుతూ ఉభయ సభల్లోనూ మంత్రులు తమ ప్రసంగాల్లో గత ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, అందుకే ప్రజలు ఓడించారంటూ అవహేళనగా మాట్లాడుతున్న తీరును వివరిస్తుండగా, చైర్మన్ అనుమతి లేకుండా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తన స్థానంలో నుంచి లేచి మాట్లాడటమే కాకుండా చైర్ వైపు చూసి కాకుండా నేరుగా సభ్యుని వైపు వెనక్కి తిరిగి మాట్లాడుతున్న వైనాన్ని చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. మంత్రులుగా సభా మర్యాదలు, సాంప్రదాయాలు పాటించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇక మిగిలిన వారు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తారన్నారు. ఇక సభను నిర్వహించే చైర్మన్ ఎందుకని ప్రశ్నించారు. మంత్రిగా సభ్యుడికి సమాధానం చెప్పదలిస్తే ముందుగా తన వైపు చేయి ఎత్తి చూపితే మాట్లాడే అవకాశం ఇస్తానని, అప్పుడు ఎంతసేపైనా మాట్లాడవచ్చంటూ సున్నితంగా మందలించారు. కాగా మండలిలో ఉన్న మాజీ మంత్రి లోకేష్ సహా మిగిలిన టీడీపీ సభ్యులందరూ లేచి మంత్రి వెలంపల్లి మాటలను తప్పుపట్టగా సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. చైర్మన్ ఇరుపక్షాల వారిని వారించడంతో వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో సభా నిర్వహణలపై శని, ఆదివారాలు సెలవు కాబట్టి వైకాపా మంత్రులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్సీ పీ శమంతకమణి చైర్మన్‌కు సూచించగా, అందుకు ప్రతిగా మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందిస్తూ ముందుగా టీడీపీ సభ్యులకు, తొలుతగా ‘అక్క’ శమంతకమణికి శిక్షణ ఇవ్వాలని పేర్కొనగా సభలో సీరియస్‌నెస్ పోయి నవ్వులు విరిసాయి.