ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హామీలతో ఇటు మంత్రులు.. అటు అధికారులు కంగు తింటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లెక్కలు, అప్పులు తేలకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి దూకుడుకు తగ్గట్టుగా ఆర్థిక వనరులులేవనే వాదనలు వినవస్తున్నాయి. ఒకవైపు నవరత్నాల అమలుకు కృతనిశ్చయంతో ఉంటే మరోవైపు అదనపు హామీలతో ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాఠశాలల్లో మరుగుదొడ్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. వేతనాలు సక్రమంగా చెల్లించనందునే అపరిశుభ్రత ఏర్పడిందని, వెంటనే పనివార్లకు చెల్లింపులు జరపాలని ఆదేశించారు. ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి పేర్ని నాని సీఎంకు వివరించినట్లు సమాచారం. నిధులు విడుదల చేయకపోవటం వల్లే ప్రధానోపాధ్యాయులు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో నెలకు ఎంత జీతం ఇస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏదో నామమాత్రంగా ఇస్తున్నారేమో.. అందుకే పారిశుద్ధ్యం పడకేసిందని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా నెలకు రూ. 18వేల వేతనం చెల్లిస్తే మంచిదని జగన్ ప్రతిపాదించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ‘కష్టం సార్.. అంటూ నమస్కరించి చేతులెత్తేసినట్లు గుసగుసలు వినవచ్చాయి.
ఎందుకు సాధ్యపడదని జగన్ ప్రశ్నించటంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకుని అవకాశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు వినికిడి. పారిశుద్ధ్య కార్మికులు చేసే పని లక్షలిచ్చినా మనం చేయగలమా అని జగన్ స్పందించినట్లు సమాచారం. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా మిగిల్చిందని పలు సందర్భాల్లో జగన్ వివరించారు. గతేడాది నాటికి రాష్ట్రంపై రూ. 2.5 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వనరులపై దృష్టి సారించాల్సి ఉండగా అలవికాని హామీలు ఏ రకమైన తలనొప్పులు తెస్తాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా..కేంద్ర నిధులు వస్తే ఇవేమీ కష్టతరం కాదని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.