ఆంధ్రప్రదేశ్‌

‘అమ్మఒడి’కే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉంది.. జాతీయ స్థాయి సగటు కంటే ఇది ఎక్కువ.. అందుకే పిల్లలను బడికి పంపే తల్లులను ప్రోత్సహించేందుకు ‘అమ్మఒడి’కి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. విద్యారంగంలో సంస్కరణలకు నాంది పలుకుతామన్నారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రతి పాఠశాలల ఫొటోగ్రాఫ్‌లు తీసి అవసరమైన అభివృద్ధి చేపడతామని ప్రకటించారు. ప్రహరీలు, టాయిలెట్లు, ఫర్నీచర్ ఇతర వసతులు కల్పిస్తామన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేస్తామని చెప్పారు. పుస్తకాలు..యూనిఫాంలు సకాలంలో అందజేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం మాదిరిగా యూనిఫాంలో అవినీతి జరగటానికి ఆస్కారమివ్వరాదని అధికారులకు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దితే ఏ విద్యార్థికి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లాలనే ఆలోచన రాదన్నారు. ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు శాసనసభలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టాన్ని నూరుశాతం అమలు చేస్తామని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులందరికీ 25 శాతం సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దేశంలో విద్య అనేది సేవే కానీ.. డబ్బు ఆర్జించే రంగం కారాదన్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మఒడి చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.. గతంలో యూనిఫాం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇందులో భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లను నియమించాలన్నారు. ఇందులో ఏవైనా మినహాయింపులు ఉంటే కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విద్యా హక్కు చట్టం రాజ్యాంగ బద్ధమైందని చెప్తూ ఇది ప్రజల హక్కని, కచ్చితంగా ప్రైవేటు స్కూళ్లలో అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. పనివార్లకు తగిన వేతనాలు చెల్లిస్తే పాఠశాలల్లో పరిశుభ్రత సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఆ దిశగా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.