ఆంధ్రప్రదేశ్‌

ఆ నిర్మాణం సక్రమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: ప్రజల అవసరాల కోసం తగిన అనుమతులతోనే.. చట్టబద్ధంగా ప్రజావేదిక నిర్మాణం జరిగింది.. అది ప్రజల ఆస్తి .. కూల్చివేత తగదని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. సోమవారం ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని సమావేశం గర్హించింది. రాష్ట్ర విభజన తరువాత రాజధాని నగరం అమరావతిలో అధికారులతో సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ సమావేశ మందిరాలు లేవని, ప్రజల నుంచి వినతులు స్వీకరించే అవకాశం కూడాలేదని ఏడాదిన్నర పాటు ప్రైవేటు కళ్యాణ మండపాల్లోనే గడపాల్సిన దుస్థితి ఉందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజావేదిక ప్రజల ఆస్తి అని..ఐదేళ్ల క్రితం రాజధాని నగరానికి వచ్చి ఏమీలేని పరిస్థితుల్లో చంద్రబాబు దీన్ని నిర్మించారని పార్టీ నేతలు గుర్తుచేశారు. ఐదేళ్ల తరువాత వచ్చి అక్రమ కట్టడం .. కూలగొట్టాలని ఆదేశాలు జారీచేయటం సమంజసం కాదన్నారు. అనధికారమైతే కలెక్టర్ల సమావేశం అందులో ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రజావేదిక కేటాయించాలని కోరితే మా అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా అది కేటాయించాల్సి వస్తుందనే కక్ష సాధింపు చర్యలో భాగంగా కూల్చివేతకు ఆదేశించారని ఆక్షేపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 16 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారాన్ని టీడీపీ నేతలు ఖండించారు. పోతుల సునీత, పంచుమర్తి అనురాధ నేతృత్వంలో టీడీపీ మహిళా నేతలు ఒంగోలులో పర్యటించి బాధితురాలని పరామర్శించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులపై సమావేశం ఆందోళన వెలిబుచ్చింది. ఆదివారం ఒక్కరోజే గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ భౌతిక దాడులకు పాల్పడటం హేయమని పార్టీ నేతలు ఖండించారు. సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, శాసనసభ్యుడు మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, వీవీవీ చౌదరి, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.