ఆంధ్రప్రదేశ్‌

మితిమీరిన ఆత్మవిశ్వాసమే కొంప ముంచిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, మే 25: చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీపై అతివిశ్వాసమే కొంపముంచిందని టీడీపీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గడానికి ఆ నలుగురే కారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోనే కుప్పం నియోజకవర్గాన్ని ఒక పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఇక్కడి నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారు. ఇందుకు అనుగుణంగా స్థానిక నేతలు అడిగిందే తడవుగా చంద్రబాబునాయుడు నిధులు విడుదల చేసేవారు. అయితే వీటన్నింటినీ స్థానిక నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం, ప్రజలకు ఉపయోగపడే పలు ప్రజాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఇవ్వడం, ట్రాక్టర్లు, జేసీబీలు, చివరకు కార్పొరేషన్ రుణాలు, స్టాండప్ ఇండియా రుణా లు సైతం ప్రజలకు ఇవ్వకుండా స్థానిక నేతలే పంచుకోవడం, జన్మభూమి కమిటీలు, చివరకు తాము ఓట్లు వేసి గెలిపించిన నాయకుడిని కలవాలంటే వేరొకరి అనుమతి తీసుకోవడం, ప్రజల కష్టాలు వినేవాడే కరవవడం వంటి పలు అంశాలు చంద్రబాబు మెజార్టీపై ప్రభావం చూ పాయని చర్చించుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ ప్రజాభివృద్ధి సం క్షేమ కార్యక్రమాలు అందేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా స్థానిక నేతలు వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన వారని అవహేళన చేయడం, జన్మభూమి సమావేశంలో వైసీపీకి చెందిన వారికి ఏ మీ ఇవ్వవద్దని అధికారులకు హుకుం జారీ చే యడం, ఇప్పటికీ వేల సంఖ్యలో ప్రజలకు రేషన్ కార్డులు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే కుప్పం, గుడుపల్లి, రామకుప్పం, శాంతీపురం మండలానికి పలువురు నాయకులు, ప్రజలు నేరుగా చం ద్రబాబును కలిసి కుప్పంలో నాయకులపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేవారు. అయితే ఆయ న వీరిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో చంద్రబాబుపై నమ్మకం సన్నగిల్లిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు చాపకింద నీరులా ప్రతి గ్రామంలో పర్యటించి అందరినీ పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ వచ్చారు. దీంతో ప్రజలకు వారిపై నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తారని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో టీడీపీ నాయకులు మిన్నకుండిపోయారు.