ఆంధ్రప్రదేశ్‌

ఎవరిని వరించేనో మంత్రి పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 24: ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. కొత్త ప్రభుత్వంలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది. మంత్రి పదవులు అలరించేదెవరిని. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం వీచింది. వందకు పైగా స్థానాలు సాధించి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంతా భావించారు. అయితే దీనికి పూర్తి భిన్నంగా రాష్ట్రం యావత్తు జగన్ ప్రభావంతో 151 స్థానాల్లో వైసీపీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. విశాఖ జిల్లాలో కూడా అందరి అంచనాలను తారుమారు చేస్తూ 11 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్లో మాత్రం వైసీపీ ఓటమి పాలైంది. జిల్లాలో వైసీపీ గెలుపొందిన స్థానాలు, గెలుపొందిన అభ్యర్థుల సీనియారిటీ, అంకిత భావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో ఏర్పాటు కాబోయే మంత్రి వర్గంలో స్థానం కల్పించే దిశగా అధినేత జగన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దదిగానే ఉంది.
భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) టీడీపీ ఎంపీగా ఉంటూ వైసీపీలో చేరారు. అవంతికి ఒకసారి ఎమ్మెల్యే, మరో సారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలోకి వచ్చే ముందే అధికారంలోకి వస్తే మంత్రి పదవి హామీ పొందారని ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో ఉంటూ అధికార టీడీపీ ఎటువంటి ప్రలోభాలు పెట్టినా పార్టీనే అంటిపెట్టుకుని పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఈ విధంగా చూస్తే పార్టీ తరపున గత ఎన్నికల్లో కిడారి సర్వేశ్వర రావు (అరకు), గిడ్డి ఈశ్వరి (పాడేరు), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల) గెలుపొందారు. వీరిలో గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు అధికార టీడీపీలోకి ఫిరాయించగా, మావోయిస్టుల చేతిలో సర్వేశ్వర రావు హత్యకు గురయ్యారు. ముత్యాలనాయుడు మాత్రం టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలోనే కొనసాగారు. తాజా ఎన్నికల్లో ముత్యాలనాయుడు మరోసారి విజయం సాధించారు.
అలాగే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొంది, జగన్ పార్టీ పెట్టిన తరువాత పదవికి రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికల్లో గెలుపొందిన గొల్ల బాబూరావు తాజాగా పాయకరావుపేట నుంచి గెలుపొందారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి బాబూరావు కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. వీరిద్దరి విశ్వసనీయతను పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ, బీసీ కోటాలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. చోడవరం నుంచి గెలుపొందిన కరణం ధర్మశ్రీ, అనకాపల్లి నుంచి గెలుపొందిన గుడివాడ అమర్‌నాథ్ కాపు కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే అవంతికి పదవి ఖరారైతే వీరిద్దరికీ అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చిత్తుగా ఓడించి విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏజెన్సీలో రెండు స్థానాల్లోనూ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు కే భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ కూడా ఎస్టీ కోటాలో పదవులు ఆశిస్తున్నారు. అయితే కురుపాం, సాలూరు నుంచి గెలుపొందిన పుష్పశ్రీవాణి, రాజన్నదొర ఎస్టీ కోటాలో పదవులు పొందేందుకు ముందు వరుసలో ఉన్నారు.