ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు మహిళల బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి బాసటగా ఉంటామంటూ భారీ సంఖ్యలో మహిళలు ఉండవల్లిలోని ఆయన నివాసానికి శనివారం తరలివచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయంపాలైన నేపథ్యంలో తామేప్పుడూ చంద్రబాబు వెంటే ఉంటామని తెలియచేసి ఓదార్చేందుకు వచ్చారు. రాష్ట్రంలోని మహిళలను ఆడపడుచులా భావించి, తమ జీవితాలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ, పెళ్లి కానుక, ఇళ్లు వంటి అనేక సౌకర్యాలు కల్పించి తమలో ఆత్మస్థైరాన్ని పెంచారని డ్వాక్రా సంఘాల మహిళలు, సాధారణ మహిళలు తెలిపారు. ఎన్నో విధాల తమను ఆదుకున్న చంద్రబాబుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో, కసితో టీడీపీ గెలుపునకు పని చేస్తామని హామీ ఇచ్చారు.