ఆంధ్రప్రదేశ్‌

ముహూర్తం కుదిరింది 30 మధ్యాహ్నం 12.23 గం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికను అధికారులు ఖరారు చేశారు. ముహూర్తం కూడా నిర్ణయం కావడంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 30న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తొలి విడతలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, పుష్పశ్రీవాణి, గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ పేరు వినబడుతున్నాయి. తొలుత విజయవాడ సమీపంలోని చినఅవుటపల్లి సమీపంలో ప్రమాణ స్వీకారోత్సవ వేదికను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. కానీ విజయవాడ నగరంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అధికారులకు జగన్ స్పష్టం చేయడంతో స్టేడియంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో గరిష్ఠంగా 50 వేల మంది మాత్రమే కూర్చునేందుకు అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా సందర్శకులను అనుమతించేందుకు నిర్ణయించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురు కాకుండా చర్యలు తీసుకునే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ నరసింహన్ సహా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మరికొంతమంది వీవీఐపీలు హాజరయ్యే
అవకాశం ఉండటంతో ఇందుకు అవసరమై భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై కృష్ణా జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఇతర అధికారులు కూడా స్టేడియాన్ని పరిశీలించారు.
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నందున అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై శనివారం వెలగపూడి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగంతోపాటు, కృష్ణాజిల్లా కలెక్టర్, విజయవాడ పోలీసు కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇతర ఆహ్వానితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా తగిన వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు ద్వారా ప్రజలను తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా స్టేడియంలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టేడియం లోపల, వెలుపల, ఇతర పబ్లిక్ ప్రాంతాలు, కూడళ్లలో ప్రత్యేక ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి ప్రజలందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేడియంలో ప్రవేశించే మార్గాలు, నిష్క్రమించే మార్గాలను సక్రమంగా నిర్దేశించి ప్రజలు సులభంగా ఈ కార్యక్రమానికి వచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు సవ్యంగా చేరుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంత మంది వీవీఐపీలు, వీఐపీలు వస్తారనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆ ప్రకారం వారికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ విభాగ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే గవర్నర్ ఇతర ప్రముఖులకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగిన ట్రాఫిక్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ఎంఐపీలు, వీవీఐపీ, వీఐపీలు, మీడియా తదితర ఐదు రకాల కేటగిరి పాస్‌లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వేల మంది కూర్చునే వీలుందని అయితే వేదిక, ఇతర ఏర్పాట్లు మూలంగా 25వేల వరకు స్టేడియంలోకి అనుమతించి మరో 10వేల మంది వరకు స్టేడియం వెలుపల ప్రత్యేక ఎల్‌ఈడీ తెరల ద్వారా తిలకించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.