ఆంధ్రప్రదేశ్‌

ఈసీ నిబంధనలు ఏపీపై కక్షసాధింపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: తిరుపతి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (తుడా) చైర్మన్‌గా తనకు కనీస గౌరవం, మర్యాద లేనప్పుడు, కిందిస్థాయి సిబ్బంది కూడా అందుబాటులో లేనప్పుడు తనకు కేటాయించిన కార్యాలయంలో ఉన్నా... చెట్టుకింద కూర్చున్నా ఒకటేనంటూ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ మంగళవారం కార్యాలయ ఆవరణలోని చెట్టుకింద కూర్చుని ఈసీ తీరుకు నిరసన తెలిపారు.
తుడా కార్యాలయానికి చేరుకున్న చైర్మన్ నరసింహ యాదవ్ తన పట్ల సిబ్బంది పట్టించుకోని పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చెట్టుకింద కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల పేరుతో ఏపీపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దేశంలో ఏపీకి మాత్రమే కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. సీఎం నుంచి తుడా చైర్మన్‌గా తన వరకు అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. పక్కనే ఉన్న రాష్ట్రాల్లోను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తమపై విధిస్తున్న నిబంధనలు వారికి ఎందుకు వర్తించడంలేదని ప్రశ్నించారు. సీఎస్‌ను, ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ తీరుతో జిల్లాలోని అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఏపని చేస్తే ఈసీ ఎలా స్పందిస్తుందోనన్న భయంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడ్డారన్నారు. తుడా చైర్మన్‌గా తాను తన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు అక్కడ అటెండర్ కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. తానే తన కార్యాలయం తలుపులు తీసుకుని, లైట్లు వేసుకోవాల్సి వస్తోందన్నారు. వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇచ్చే వారు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి నిబంధనలు ఎందుకు ఈసీ అమలు చేస్తోందో చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు తమను తమ కార్యాలయాలకు రావద్దంటే సరిపోతుంది కదా అన్నారు. దీనిపై ఈసీ స్పందించే వరకు తన పోరాటం ఆగదన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతీయడమే లక్ష్యంగా ఈసీ పెట్టుకున్నట్లు కనిపిస్తోందని నరసింహ యాదవ్ అభిప్రాయపడ్డారు.
చిత్రం... మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద కూర్చుని నిరసన తెలుపుతున్న తుడా చైర్మన్ నరసింహయాదవ్