ఆంధ్రప్రదేశ్‌

ఈసీ వైఖరికి గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 19: ప్రజా సమస్యలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తే తప్పెలా అవుతుందని మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వానికి జూన్ నెల వరకు అధికారం ఉందని, ప్రజా సమస్యలపై సమీక్షించకూడదని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. ఈసీ ప్రధాని మోదీకి తొత్తుగా మారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము ఈసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు కానీ, 13 కేసుల్లో ఎ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయగానే అధికారులను బదిలీ చేశారని విమర్శించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి వైసీపీకి అనుకూలంగా ఉండేలా ఈసీ ప్రయత్నం చేసిందని ఆరోపించా రు. ఈవీఎంలలో లోపాలపై పోరాడుతున్నది టీడీపీ కోసం కాదని, దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమేనని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ లోపాలపై తమ పార్టీ పోరాడుతోందని చెప్పారు. 50శాతం వీవీప్యాట్లను లెక్కించడంలో ఈసీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. గతంలో పేపర్ బ్యాలెట్ ఫలితాలే ఒక్కరోజులో విడుదల చేస్తే, ఇప్పుడు వీవీప్యాట్లను 50శాతం లెక్కించడానికి ఆరు రోజుల సమయం పడుతుందని ఈసీ వాదించటం విడ్డూరమన్నారు.