ఆంధ్రప్రదేశ్‌

బీసీలపై మోదీ కపట ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 19: బీసీలపై మోదీ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కులాలు, మతాలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. బీసీని కాబట్టే తనపై విమర్శలు చేస్తున్నారని మోదీ చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా కులాల ప్రస్థావన తేలేదని, మోదీ మాత్రం నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఆ పదవికి మచ్చ తెస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో బీసీలను గుర్తించని మోదీ ఎన్నికల సమయంలో వారి జపం చేస్తున్నారన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత బీసీలపై 12.5 శాతం దాడులు పెరిగాయన్నారు. 1984లో నరేంద్ర మోదీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఇప్పుడు ఓటమి భయంతోనే కులాల ప్రస్థావన తెస్తున్నారన్నారు. వీపీ సింగ్ మండల్ కమిషన్ వేస్తే అప్పటి బీజేపీ ప్రభుత్వం నిలిపివేసింది నిజంకాదా అని ప్రశ్నించారు. 2011లో జస్టిస్ ఈశ్వరయ్య బీసీ కులాల కేటగిరైజేషన్‌ను ప్రతిపాదిస్తే అమలులో బీజేపీ విఫలమైంది వాస్తవం కాదా అని నిలదీశారు. బీసీలపై మోదీకి నిజంగా ప్రేమ ఉంటే ఆంధ్రాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు.