ఆంధ్రప్రదేశ్‌

నాణేల సేకరణకు ఫెడరల్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 19: టీటీడీ పరకామణి విభాగంలో నిల్వ ఉన్న చిల్లర నాణేలను సేకరించేందుకు ఫెడరల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరకామణిలో శుక్రవారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ సమక్షంలో పరకామణి డిప్యూటీ ఈఓ దామోదరం నుంచి మొదటి నాణేల సంచిని ఫెడరల్ బ్యాంక్ సీఈఓ, ఎండి శ్యామ్ శ్రీనివాసన్ అందుకున్నారు. రానున్న ఐదారు నెలల్లో సుమారు రూ. 10 కోట్ల విలువైన భారతీయ నాణేలను ఫెడరల్ బ్యాంక్ సేకరించి తరలించనుంది. ప్రతిరోజూ భక్తులు సమర్పించే నాణేలాను కూడా ఆంధ్రాబ్యాంక్‌తోపాటుగా ఫెడరల్ బ్యాంక్ కూడా సేకరిస్తుంది.