ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ నేతల్లో ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 19: వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, ఏం మాట్లాడుతున్నారే వారికే అర్థం కావడం లేదని టీడీపీ శాసనమండలి సభ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిందని చెప్పిన వైసీపీ నాయకులు, ఇప్పుడు కుట్రలు జరిగాయని ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో ఏది నిజమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కుట్ర పన్ని ఆర్‌ఓలుగా తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుని ఎన్నికలను అపహాస్యం చేసిందని వారు విమర్శించటాన్ని ఖండించారు. కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని మోదీ ఎన్నికల ప్రచారాలకు వెళుతున్నారన్నారు. ఈవీఎంలపై ఐటీ నిపుణులు హరిప్రసాద్‌తో ఈసీ మాట్లాడటమేమిటని అంటున్నారని, అయితే పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డితో ఈసీ ఎలా మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమించారో ఈసీనే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ అంటున్నారని, చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లు పదవిలో ఉంటారని, ఇది రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు అని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.