ఆంధ్రప్రదేశ్‌

రైతులు-శాస్తవ్రేత్తల ముఖాముఖి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: రైతులు, శాస్తవ్రేత్తలు నిత్యం ముఖాముఖి మాట్లాడుకుంటే వ్యవసాయంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఇందుకు వేదికగా నిలవాలన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆత్కూరు స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను శుక్రవారం వెంకయ్య నాయుడు ప్రారంభించి తిలకించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాను ఉప రాష్టప్రతి అయిన తరువాత యూనివర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించానని వారందరికీ కూడా రైతులు, శాస్తవ్రేత్తలు ముఖాముఖి మాట్లాడుకోవాలని సూచించానన్నారు. వ్యవసాయ సాగు అభివృద్ధికి రైతుకు మేలు జరగాలంటే కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల అనుసంధానంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. 12 గంటల పాటు రైతులకు విద్యుత్ ఇస్తేనే నిజమైన ప్రభుత్వం అని, దీని కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. రైతులకు అనువైన తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలన్నారు. పంట రుణాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. రైతులు పండించిన పంటకు మార్కెటింగ్, గోడౌన్‌లు, కోల్డ్‌స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తే గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. వ్యవసాయ అభివృద్ధికి దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న అధికారులు, వ్యవసాయ యూనివర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విద్యార్థులు, రైతులు కలిసి కూర్చొని చర్చిస్తే పరిష్కారాలు లభిస్తాయన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఎలీప్ సంస్థ సహకారంతో స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉప రాష్టప్రతి చేతుల మీదుగా సర్ట్ఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి దామోదరనాయుడు, యూనివర్శిటీ ప్రతినిధులు ఎంఏ నాయుడు, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, మేకల లక్ష్మీనారాయణ, గణపతిరావుతదితరులు పాల్గొన్నారు.