ఆంధ్రప్రదేశ్‌

గోవిందరాజ స్వామివారి పుష్కరిణిలో లేజర్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 15: స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్కరిణిలో 20 నిమిషాల పాటు లేజర్ షో ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జేఈఓ బి.లక్ష్మీకాంతం చెప్పారు. భక్తులతో భవదీయుడు కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనం వద్ద ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు తిరుమలలోని శ్రీ వరాహ స్వామిని ఆ తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శిస్తేనే యాత్ర సంపూర్ణం అవుతుందని అన్నారు. టీటీడీలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నామన్నారు. తిరుచానూరులోని శుక్రవారపు తోటలో పద్మావతి పరిణయం, శ్రీనివాస కల్యాణం వృత్తాంతం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీటీడీ అనుంబంధ ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బ్రహ్మోత్సవాలలోపు వేగంగా పూర్తిచేయాలన్నారు. అలాగే టీటీడీ కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం మరింత వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన ఫోన్ చేసిన భక్తులతో మాట్లాడారు. అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఎన్నారై సత్యనారాయణ మాట్లాడుతూ అమెరికాలో నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని, అలాగే శుభప్రదం కార్యక్రమాలను కూడా అమెరికాలో నిర్వహించాలని కోరారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే వేదపారాయణంను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. దీనిపై జేఈఓ స్పందిస్తూ అమెరికాలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, వేదపారాయణం ప్రత్యక్ష ప్రసారంపై ఆగమ సలహాదారులతో చర్చిస్తామన్నారు. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీటీడీ పంచాంగం క్యాలెండర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, పెంచలకోనలో టీటీడీ వసతిగృహాలను అందుబాటులోకి తేవాలని, శ్రీ గోవిందరాజ స్వామివారి కిరీటాల చోరీ కేసుపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై లక్ష్మీకాంతం మాట్లాడుతూ టీటీడీ పంచాంగం క్యాలెండర్‌ను అందుబాటులోకి తెస్తామని, పెంచలకోనలో టీటీడీ నిర్మించిన వసతిగృహాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కిరీటాల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భద్రతను పటిష్టం చేస్తామన్నారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో టీటీడీ విద్యా, వైద్యసేవలను ఏర్పాటు చేయాలని విజయవాడకు చెందిన నాగభూషణం కోరారు. ప్రతి జిల్లాలో టీటీడీ విద్యాసంస్థలు, వైద్యశాలలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. తిరుపతికి చెందిన జ్ఞానప్రకాష్ చేసిన సూచనలపై ఆయన స్పందిస్తూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. వారికి అవసరమైన సమాచారం ఐఓటి, ఐటీ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీటీడీ సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓలు సుబ్రహ్మణ్యం, ఝాన్సీరాణి, శ్రీ్ధర్, వరలక్ష్మి, ధనంజయులు పాల్గొన్నారు.

నేటి నుంచి తిరుమలేశుని సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుపతి, మార్చి 15: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరణిని అందంగా అలంకరించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. తిరుమలలో తెప్పోత్సవాలు ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాళువ నరసింహరాయలు క్రీశ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. క్రీశ 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను ఘనంగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెనె్నల కాంతుల్లో ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. కాగా తెప్పోత్సవాల్లో తొలిరోజైన శనివారం శ్రీ సీత, లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.