ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టుకు అవసరమైన వసతులు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18 నుంచి నేలపాడులోని నూతన భవనంలో కార్యకలాపాలను ప్రారంభించనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన హైకోర్టుకు అవసరమైన వివిధ సౌకర్యాలు తదితర అంశాలపై సీఆర్‌డీఏ, హైకోర్టు రిజిస్ట్రార్లు, తదితర శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ నెల 18 నుంచి కొత్త భవనంలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యాయమూర్తులు, న్యాయాధికారుల సూచన మేరకు ఏర్పాట్లు, వసతులు కల్పించాలన్నారు. కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు, రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో అవసరమైన ఫర్నిచర్, ఇంటర్నెట్, కంప్యూటర్ల వంటి సౌకర్యాలు సోమవారం నాటికి పూర్తిగా ఏర్పాటు చేయాలన్నారు.