ఆంధ్రప్రదేశ్‌

12 శాతం వృద్ధి రేటు సాధించిన ఆర్‌ఐఎన్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 15: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నుంచి 12 శాతం వృద్ధి రేటు సాధించనుందని సీఎండీ పీకే రథ్ వెల్లడించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్పత్తి, సామర్థ్య వినియోగం సహా వివిధ అంశాల ద్వారా ఈ వృద్ధి రేటు సాధ్యమవుతోందన్నారు. ఉక్కు ఉత్పత్తుల విక్రయాల ద్వారా రూ.20,500 కోట్ల టర్నోవర్ సాధించే దిశగా కర్మాగారం ముందుకు సాగుతోందని, గతేడాదితో పోలిస్తే ఇది 9 శాతం అధికంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2017లో తీసుకువచ్చిన నేషనల్ స్టీల్ పాలసీ (ఎన్‌ఎస్‌పీ)లో భాగంగా భారత స్టీల్ పరిశ్రమ 300 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. రానున్న 2030-31 నాటికి దేశంలో తలసరి ఉక్కు వినియోగం 160 కిలోలకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో తలసరి ఉక్కు వినియోగం కేవలం 72 కిలోలు మాత్రమే. అంశాల వారీగా చూస్తే ఆర్‌ఐఎన్‌ఎల్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. హట్ మెటల్ ఉత్పత్తిలో 13 శాతం, ఫినిష్డ్ స్టీల్‌లో 10 శాతం, సేలబుల్ స్టీల్‌లో 11 శాతం, వేల్యూ యాడెడ్ స్టీల్ ఉత్పాదనలు 34 శాతం వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ లేబర్ ప్రొడక్టివిటీని పెంచుకుంటోందన్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి 542 టీసీఎస్ సాధించామని, ప్లాంట్ ప్రారంభించిన తరువాత ఇదే అత్యుత్తమమని పేర్కొన్నారు. నీటి నివియోగంలో కూడా ఆర్‌ఐఎన్‌ఎల్ ప్రపంచంలోనే ఇతర ఉక్కు కర్మాగారాల కంటే తక్కువలో ఉందన్నారు.
ముడి సరుకు కొనుగోలు, తదితర అంశాల్లో కూడా ఖర్చును నియంత్రించుకుంటూ ఆర్‌ఐఎన్‌ఎల్ ఆర్థిక నియంత్రణలో ముందుందన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాయబరేలిలో ప్రారంభించిన మినీ స్టీల్ ప్లాంట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించనుందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా భారతీయ రైల్వేకి అవసరమైన పరికరాలు ఉత్పత్తి చేయడం ద్వారా ఒకరికొకరు లబ్దిపొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ త్వరలోనే కేఐఓసీఎల్ సంస్థతో పిల్లెట్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనుందని సీఎండీ రథ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, రోహ్‌తంగ్ టనె్నల్, మెట్రో రైల్ ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని తెలిపారు.
విశాఖ ఉక్కుకు కర్మాగారం ఏపీఎండీసీతో కలిసి కుకునూరు ఐరన్‌ఓర్ గనుల నుంచి ముడి సరుకు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుందన్నారు. అలాగే ఒడిశా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థతో కూడా మూడు గనుల నుంచి ముడి సరుకు కొనుగోలుకు ఒప్పందం కుదిరిందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఆలస్యమైనప్పటికీ త్వరలోనే ఒడిశాలోని మూడు గనుల నుంచి ముడి సరకు సరఫరాకు అవాంతరాలు తొలగుతాయన్నారు. ఈ ఏడాది వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2 నిర్మాణం శరవేగంతో జరుగుతోందన్నారు. ప్రస్తుతం కేబీఆర్ 1 ద్వారా 45 రోజులకు సరిపడా నీటి నిల్వసామర్ధ్యం కలిగి ఉన్నామని, రెండో రిజర్వాయర్ పూర్తయితే 90 రోజుల వరకూ నీటికి ఇబ్బంది ఉండదన్నారు. ఉక్కు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న కోక్ ఓవెన్ బ్యాటరీ 5 ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. సమావేశంలో ఆర్‌ఐఎన్‌ఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వీవీ వేణుగోపాలరావు, డైరెక్టర్ (కమర్షియల్) పీ రాయ్ చౌదురి పాల్గొన్నారు.