ఆంధ్రప్రదేశ్‌

నాలుగు చక్కెర కర్మాగారాలకు ఎన్‌సీడీసీ రూ. 100 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: రాష్ట్రంలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రూపాయల మేర వర్కింగ్ క్యాపిటల్ కింద రుణం సమకూరనుంది. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ)కి భీమసింగి, గోవాడ, ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాలకు వర్కింగ్ క్యాపిటల్ కింద 200 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనను ఎన్‌సీడీసీ అమోదించి, తొలివిడతగా 100 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని నాలుగు కర్మాగారాలకు పంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భీమసింగి చక్కెర కర్మాగారానికి 12 కోట్ల రూపాయలు, గోవాడ కర్మాగారానికి 44 కోట్లు, ఏటికొప్పాక కర్మాగారానికి 23 కోట్లు, తాండవ కర్మాగారానికి 21 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.