రాష్ట్రీయం

అక్రమ నిల్వలు లేకున్నా కేసుల బనాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర సదస్సులో వక్తల ఆందోళన

గుంటూరు , నవంబర్ 22: పప్పు్ధన్యాల కొరత నెలకొనటంతో ప్రభుత్వాధికారులు వ్యాపార సంస్థలపై దాడులు చేసి నిల్వలు లేకపోయినప్పటికీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎపి ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ కన్వీనర్ తంగుటూరి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణిని ప్రభుత్వం విడనాడాలని కోరారు. ఎపి ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఫ్యాన్సీ కల్యాణ మండపంలో జరిగిన రాష్టస్థ్రాయి సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు టర్నోవర్ ట్యాక్స్, వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేశాయని, తరువాత అవి పడిపోయిన విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తెరగాలని రామకృష్ణ అన్నారు.
ఎఫ్‌సిఐ లైసెన్సు పొందినవారు ఇన్ని బస్తాలు నిల్వ చేసుకోవచ్చని ప్రభుత్వమే అనుమతి ఇచ్చి స్వల్ప కారణాలు చూపుతూ సరకును స్వాధీనం చేసుకోవటం తగదన్నారు. షాపుల నుండి గిడ్డంగులు, గిడ్డంగుల నుండి షాపులకు వస్తువులు తరలిస్తున్న సమయంలో కూడా వే బిల్లులు అడుగుతున్నారని, ఇలాగైతే వ్యాపారస్థులు వ్యాపారాలు చేయడం కష్టమన్నారు. ది గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఇంటిగ్రేడెట్ లైసెన్స్ విధానం వల్ల షాపుల్లో పనిచేసే గుమస్తాల బ్యాంక్ ఎకౌంట్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డులు ఇచ్చి లేబర్ లైసెన్సులు రెన్యువల్ చేయాలని కార్మిక శాఖాధికారులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. గుమస్తాలు ప్రభుత్వం అడిగిన వివరాలు ఇవ్వడానికి సుముఖంగా లేరన్నారు. గుమస్తాలు ఒక నెల ఒక షాపులో పనిచేస్తే రెండో నెలలో మరో షాపులో చేసే అవకాశముందని, అలాంటి వివరాలు నెలనెలా పక్కాగా తెలియజేయటం కష్టసాధ్యమన్నారు. సంఘం జిల్లా కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్, ఒంగోలు చాంబర్ అధ్యక్షుడు శ్రీరాములు, హార్డ్‌వేర్, ఐరన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తెస్తున్న కొత్తకొత్త విధానాల వల్ల చిరువ్యాపారులు రోడ్డునపడే ప్రమాదముందని వివరించారు. ఈ సమావేశంలో దేవరపల్లి లక్ష్మీనారాయణ, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, అన్నా పూర్ణచంద్రరావు, శాంతరావు, తదితరులు పాల్గొన్నారు.