జాతీయ వార్తలు

రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చారిత్రాత్మకమైందని అన్నారు. లక్షలాది మంది మైనారిటీల హక్కులు కాపాడబడతాయని అన్నారు. దేశ ఐక్యతకు విశ్వసనీయతను చాటుతుందని అన్నారు. శరణార్థులకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు. బిల్లుపై విపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఈ వైఖరి మానుకోవాలని హితవు పలికారు. విపక్షాలు వాకౌట్ చేయకుండా చర్చలో పాల్గొనాలని కోరారు.