అమృత వర్షిణి

సమైక్యతా సేతువు - షణ్ముఖ వడివు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని దశాబ్దాలుగా రేడియోలో యమ్.ఎస్.సుబ్బులక్ష్మి పాడే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వింటున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పని చేసిన పివిఆర్‌కె ప్రసాద్ గారి ప్రేరణతోనే ఈ రికార్డింగ్ జరిగింది.
హెచ్‌ఎంవి లో రికార్డింగ్ ఇంజనీరైన ‘రఘు’ రికార్డు చేశారు. రఘు స్వయంగా కర్ణాటక సంగీత జ్ఞానం కలిగి పాడగల సమర్థుడు. పాటలు రికార్డ్ చేసేవారికి కొంతైనా సంగీతాభిరుచి వుంటే గాయకులు, పాడుతూ గుర్తించలేని దోషాలను సవరించే అవకాశముంటుంది.
ఇది వరకటి రోజుల్లో 40 - 50 వాద్యాలతో రికార్డు చేసే సమయంలో, గాయకుల వల్ల గానీ, వాద్య బృందం వల్ల గానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ ఆ పాట రికార్డు చేయవలసి వచ్చేది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో లేదు.
గాయకులైనా, వాదకులైనా అందరూ ఒకేసారి ఈ వేళ స్టూడియోలో ఉండక్కర్లేదు. వీలైనప్పుడు రావచ్చు. పాడి వెళ్లవచ్చు.
ఎవరి పాట వారు పాడేసి వెళ్లిపోయే మల్టీ ట్రాక్ సిస్టమ్ ఆ రోజుల్లో లేదు.
కేవలం మూడున్నర నిమిషాల పాట కోసం కళాకారులంతా గంటల తరబడి స్టూడియోల్లో మగ్గిపోవలసి వచ్చేది.
అంతేనా? పాడవలసిన ప్రతిసారీ ఎప్పటికప్పుడు భావం నీరసపడకుండా పాడాలి. ఎంత కష్టపడేవారో? ఆలోచించండి.
మొదటిసారి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం మద్రాసు రేడియోలో ప్రసారమైన వెంటనే ఆనాటి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి విన్న మరుక్షణం సుబ్బులక్ష్మి ఇంటికి బయలుదేరారు. సుబ్బులక్ష్మి వడ్డించిన టిఫిన్, కాఫీలు తీసుకున్న తర్వాత రాజాజీ ‘కుంజమ్మా! ప్రొద్దున నీ సుప్రభాతం రేడియోలో విన్నాను. విన్న తర్వాతే ఇక్కడకు వచ్చాను. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది సుమా! అక్కడ తిరుమల కొండలున్నంత వరకూ నీ సుప్రభాతం వినిపిస్తూనే ఉంటుంది - అంటూ ప్రశంసలు కురిపించారు. సిగ్గుపడిపోతూ కృతజ్ఞతా పూర్వకంగా వంగి నమస్కరించి నిలబడి చూస్తూండగా మళ్లీ రాజాజీ ‘నువ్వు ఇలాంటి పనే మరొకటి చేయాలి. విష్ణు సహస్ర నామాలు కూడా రికార్డ్ చేయాలి. విష్ణు సహస్ర నామాలు పలికినా, విన్నా మానవులు సుఖ సంతోషాలతో బ్రతుకుతూ, చివరకు జన్మ సంసార బంధాలు తెంచుకునేందుకు సులువైన మార్గం వుందని లోకానికి నువ్వు చెప్పాలి’
రాజాజీ మాటకు సుబ్బులక్ష్మి ఆనందానికి అవధులు లేవు. రాజాజీ యమ్మెస్, సదాశివం కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. స్నేహితుడు, శ్రేయోభిలాషిగా ప్రపంచానికి తెలుసు. అనుకోవడమే పనిగా వారం రోజుల తర్వాత సుబ్బులక్ష్మి వుండే కల్కి బంగ్లాలోకి చక్కని సంప్రదాయ పంచెకట్టుతో, శరీరమంతా వైష్ణవ నామాలతో ఉత్తరీయం కప్పుకుని ‘అగ్నిహోత్రం రామానుజ తాతాచారి’ అనే వేద వేదాంగ పండితుడు వచ్చి అందర్నీ పలకరించి కూర్చున్నారు. సుబ్బులక్ష్మి విష్ణు సహస్ర నామాలు ఆయనకు ఎదురుగా కూర్చుని ప్రతిరోజు వినిపించేది.
సాధారణంగా తమిళ భాష పలుకుబడికి, సంస్కృత ఉచ్చారణ సరిపడదు. తెలుగు సరేసరి. కొన్ని నెలలు సాధన చేసి, రికార్డింగ్ కంఠస్థమయ్యేలా సిద్ధమైంది సుబ్బులక్ష్మి. ఆమెకు అప్పుడు 54 ఏళ్లు. హెచ్‌ఎంవి లో రికార్డింగ్ ఇంజనీర్ పేరు రఘు. చాలా తెలివైన సంగీత జ్ఞానం కలిగిన రసజ్ఞుడు. ఆయన వృత్తి ఇంజనీర్. ప్రవృత్తి సంగీతమే. రేడియోలో ఒక గమ్మతె్తైన సంప్రదాయం ఉంది. డిగ్రీలు, డిప్లొమోలు కలిగి ప్రత్యేక శిక్షణ పొందిన ఇంజనీర్లు (సాంకేతిక సిబ్బంది) ప్రసారానికి అవసరమైన రికార్డింగ్ వ్యవహారాలు పర్యవేక్షించటమే తప్ప స్వయంగా మాత్రం వచ్చి కూర్చుని ఎవరూ రికార్డు చేసే పద్ధతి లేదు.
సంగీతానికే అంకితమై అందులో మాత్రమే ప్రత్యేక అర్హతలు కలిగిన విద్వాంసులే రికార్డింగ్ చేయటం గమనార్హం.
సాంకేతిక నిపుణులు మాత్రం సంగీతం జోలికి వెళ్లరు. వినరు. సంగీత విద్వాంసులకు సాంకేతిక విషయాలు తెలియవు. హెచ్‌ఎంవి రఘుగా ప్రసిద్ధుడైన ‘రఘు’ మాత్రం సౌండ్ ఇంజనీర్‌గా ఆకాశవాణిలో పని చేసిన అనుభవంతో సంగీత జ్ఞానం పుష్కలంగా వుండి స్వయంగా పాడగలిగిన అరుదైన వ్యక్తి.
హెచ్‌ఎంవి కంపెనీలో రికార్డింగ్ ఇంజనీర్‌గా ప్రసిద్ధుడైన ‘రఘు’ ఇంటి పేరే ఆ తర్వాత హెచ్‌ఎంవిగా మారింది.
1973 సం.లో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు అనారోగ్యంతో వుండి, స్టూడియోకి రాలేని దశలో ‘్భగవద్గీత’ రికార్డింగ్ చేసిన ఇంజనీరు ఈ ‘రఘు’..యే.
స్వయంగా గాయకుడే ఇంజనీరు అవ్వటం వల్ల, దోషాలను గుర్తించటం తేలిక.
రేడియో రికార్డింగు బూతుల్లో కూర్చుని ఏ ఒక్కనాడు రికార్డింగ్ చేసే అలవాటు లేని రేడియో ఇంజనీరు రికార్డింగ్‌లో అనుభవాన్ని సంపాదించటమే అరుదు.
సంగీతం తెలియటం, పాడటం ఇంకా అరుదు. చాలా కాలంగా ఆలిండియా రేడియోలో ఆ రోజుల్లో ‘స్పూల్ రికార్డింగ్’ మాత్రమే వుండేది. 7 ఇంచ్‌ల స్పూల్ టేపులో దోషాన్ని గ్రహించి, ఆ కాస్త భాగం సర్జరీ చేసినట్లుగా కత్తిరించి సవరించటం ఈ హెచ్‌ఎంవి రఘులోని ప్రత్యేకత.
పాడే సమయంలో ద్విత్వాక్షరాలు మైకులో చాలా ఇబ్బంది పెట్తాయి. ఎంతో జాగ్రత్తగా ఊపిరిని వదులుతూ పాడవలసిన అక్షరాలుంటాయి. భావంతో పాడే మాటలుంటాయి. ఆవేశాన్ని నింపవలసిన వుంటాయి. స్టూడియోలో మొత్తం వాద్య బృందం ఒక్కసారి వాయించి వదలగానే ఉత్తర క్షణంలో అందుకోవలసిన పల్లవి లేదా చరణం ఎంతో జాగ్రత్తగా ఉచ్చరించాలి. పైగా ఆ రోజుల్లో వాద్య బృంద గాయకుడు చూడగలిగేలా వుండేది. ఉద్వేగ పడకుండా, హుషారుగా జీవంతో, భావంతో, కేవలం మూడున్నర నిమిషాల పాట పాడటం మాత్రం నిజానికి అసిధారా వ్రతమే. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఎంతో ఖర్చు పెట్టి రికార్డు చేసి విడుదలైన రికార్డు తప్పుల తడకలా ఉండకూడదుగా. సినిమా పాటలైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నటులే పాడిన అనుభూతి కనిపించాలిగా?
* * *
ఈ 29 నిమిషాల నిడివిగల ‘శ్రీ విష్ణు సహస్ర నామం’ స్వయంగా ఈ రఘుయే రికార్డు చేయగా శ్రీమతి సుబ్బులక్ష్మి, రాధ కలిసి పాడి రికార్డింగ్ పూరె్తై ఇవతలకు వచ్చి కూర్చుని వింటున్నారు. పొరబాటునో గ్రహపాటునో రెండు దోషాలు దొర్లాయి. ‘శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే దగ్గర ‘ప్రత్యర్థే’ అని పాడినట్లు రికార్డైంది. ‘అమానీ మానదో మాన్యో’ దగ్గర ‘అమానీ’లో మీ గొంతు వినిపించలేదన్నాడు రఘు. సదాశివం, సుబ్బులక్ష్మి వైపు తిరిగి అగ్నిహోత్రం తాతాచారి ‘మళ్లీ రికార్డు చేయవలసినదే’ అనేసరికి సుబ్బులక్ష్మి నీరసపడిపోయి, గోడకు జారిపోయింది. కొత్తగా వచ్చి చేరిన షుగర్ వ్యాధి చాలా బాధ పెడ్తోంది. తన శరీరం, మనస్సు ఆ వ్యాధికింకా అలవాటు పడలేదు. ఇంక తప్పదన్నట్లు ‘రాధా పద, తంబూరా తీసుకో’ అంటూ ఇద్దరూ మైకు వద్దకు కదిలారు.
ఆ ఒక్క తప్పు దిద్దుకోవాలన్నా మళ్లీ అరగంటా పాడవలసినదే. ఇంతలో సౌండు ఇంజనీరు రఘు ‘అమ్మా! మీరాగండి. నేను దీన్ని ఎడిటింగ్‌లో (7 ఇంచ్ స్పూల్ టేప్) దోషం ఎక్కడుందో కనిపెట్టి, గుర్తుపెట్టి, అక్కడ అతికేశాడు. అంతే సమస్య కాస్తా క్షణంలో పరిష్కారం చేసిన రఘుని అందరూ అభినందించారు.
విష్ణు సహస్ర నామంకు తోడుగా భజగోవింద శ్లోకాలు రికార్డు చేశారు. రాజాజీ పుణ్యమాయని అలా ‘విష్ణు సహస్ర నామం’ ప్రపంచ ప్రసిద్ధమైంది. మహాగాయని సుబ్బులక్ష్మి జన్మ చరితార్థమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజుల్లో సుబ్బులక్ష్మి పాడిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రికార్డుకు వచ్చిన రాయల్టీ నాలుగు లక్షలకు పైగానే. ఆ సొమ్మును తిరిగి దేవస్థానానికే ఇచ్చేసిన ఔదార్యం ఆమెది.
తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అతి పెద్ద దేవాలయాల్లో సంగీత సాహిత్యాలపై అవగాహన కలిగిన అధికారుల కొరత ఎప్పుడూ వుండనే ఉంటుంది. ఈ లోపం ఇంకా దశాబ్దాలుగా దేవస్థానంలో వుండనే వుంది. సంప్రదాయ సంగీతం విలువ తెలిసిన వారు చాలా అరుదు.
ఆ రోజుల్లో జరిగిన సంగతి. ఓసారి టిటిడి వారు సుబ్బులక్ష్మి పాట కచేరీకి పారితోషికం ఎంత తీసుకుంటారని అడిగారట. ‘75 వేలు’ అని సమాధానం వచ్చింది. ఆ తర్వాత రెండు మాసాల పాటు ఏ కబురూ లేదు.
ఆ తర్వాత సుబ్బులక్ష్మిని ఆహ్వానించి కచేరీ పాడించి 75 వేలు ఇచ్చారట.
ఆమె తన పర్సులోంచి మరో పాతిక వేలు తీసి, లక్ష రూపాయలు హుండీలో వేయండి. రెండు నెలల క్రితమే 75 వేలు వేయాలనుకున్నాను. ఆలస్యమైంది. వడ్డీకాసుల వాడికి వడ్డీతో ఇవ్వాలి’ అంది.
సంగీతంలో పరిపూర్ణత కోసం జీవితాంతం తపించిన విద్వాంసురాలామె.
కర్ణాటక సంగీత విద్వాంసులు ఎంత గొప్పగా గానం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ‘ఆస్తులు వెనకేసుకున్న వారిని లెక్కించాలంటే మనకున్న చేతివేళ్ల సంఖ్య ఎక్కువే. సుబ్బులక్ష్మి వంటి అంతర్జాతీయ సంగీత శిరోమణి లేదు. ఆమెకు మిగిలిన స్థిరాస్తి కంటే కోట్లాది మంది అభిమానమే ఆమెకు తరగని ఆస్తి.
విశ్వమానవాళిని తన సంగీత ప్రతిభతో సమ్మోహనం చేసిన సుబ్బులక్ష్మి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచం నాలుగు దిశలా విస్తరిల్లచేసిన మహాగాయని.

- మల్లాది సూరిబాబు 90527 65490