క్రీడాభూమి

మూడో టెస్టుకు స్టెయిన్ డౌటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా వెల్లడి
నాగపూర్, నవంబర్ 24: విసిఎ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆడడం అనుమానంగానే ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా చెప్పాడు. మంగళవారం నెట్స్ అనంతరం అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కండరాల నొప్పితో బాధపడుతున్న స్టెయిన్ పూర్తిగా కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నాడు. మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో ఎదురైన పరాజయాన్ని అతను ప్రస్తావిస్తూ, ఆ మ్యాచ్ మొదటి మూడు ఇన్నింగ్స్ పోటాపోటీగా సాగాయని అన్నాడు. చివరి ఇన్నింగ్స్‌లో తాము అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం వల్లే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. ఆ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 201 పరుగులు సాధించగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటై, దక్షిణాఫ్రికా ముందు 218 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, అత్యంత సాధారణంగా కనిపించిన ఈ స్కోరును చేయడంలో విఫలమైన సఫారీలు 109 పరుగులకే ఆలౌటయ్యారు. అప్పటి వరకూ భారత్‌తో పోటాపోటీగా నిలిచిన తాము చివరి ఇన్నింగ్స్‌లో సక్రమంగా ఆడలేకపోయామని, ఫలితంగా మ్యాచ్‌ని చేజార్చుకున్నామని ఆమ్లా అన్నాడు. మూడో టెస్టును గెల్చుకొని, భారత్‌కు సమవుజ్జీగా నిలవడమే తమ లక్ష్యమన్నాడు.