అంతర్జాతీయం

అమెరికాలో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14 మంది దారుణ హత్య
కాలిఫోర్నియా క్రిస్మస్ పార్టీలో పాక్ జంట ఘాతుకం
శాన్‌ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 3: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం భారీ ఆయుధాలు ధరించిన పాకిస్తానీ సంతతికి చెందిన ఓ జంట వికలాంగుల మధ్య జరుగుతున్న ఓ క్రిస్మస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కనీసం 14 మంది నిపోగా, మరో 17 మంది గాయపడ్డారు. 2012 తర్వాత అమెరికాలో ఇంత పెద్దఎత్తున కాల్పుల సంఘటన జరగడం ఇదే మొదటిసారి. సైనిక యూనిఫామ్ ధరించిన ఈ ఇద్దరు శాన్ బెర్నార్డినోలోని ఇన్‌లాండ్ రీజినల్ సెంటర్‌లో జరుగుతున్న పార్టీని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన అనంతరం ఒక బ్లాక్ ఎస్‌యువి వాహనంలో పారిపోయారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. కొద్ది గంటల పాటు వాహనాన్ని వెంబడించిన పోలీసులు ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ ఇద్దరినీ కాల్చి చంపారు. ఆ ఇద్దరినీ పాకిస్తానీ సంతతికి చెందిన సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ (28) తష్ఫీన్ మాలిక్ (27)గా గుర్తించినట్లు శాన్ బెర్నార్డినో పోలీసు అధికారి జారోడ్ బుర్గ్వాన్ చెప్పారు. రీజినల్ సెంటర్‌లో 500 మందికి పైగా హాజరైన పార్టీలో కౌంటీ ఆరోగ్య విభాగానికి చెందిన ఉద్యోగులు పాల్గొంటున్న సమయంలో ఈ కాల్పుల ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఫరూక్, తష్ఫీన్‌లు దంపతులని, వీరిద్దరికి ఆరునెలల వయసున్న కుమార్తె ఉన్నారని ఫరూక్ బావమరిది ఫర్హాన్ ఖాన్ చెప్పాడు. ఫరూక్ అమెరికాలోనే పుట్టాడని, అమెరికా పౌరుడని తెలుస్తోంది. అతను కౌంటీ ఆరోగ్య విభాగంలో పర్యావరణ స్పెషలిస్టని, కొంతకాలం క్రితం ఇన్‌లాండ్ రీజినల్ సెంటర్‌లో పని చేసాడని తెలుస్తోంది. ఫరూక్ కూడా పార్టీలో ఉన్నాడని, ఒక వివాదం కారణంగా కోపంతో మధ్యలో వెళ్లిపోయాడని బుర్గ్వాన్ చెప్పాడు. అతను ఆ తర్వాత తన భార్యతో కలిసి పేలుడు పరికరాలు, ఎకె తరహా రైఫిళ్లు, హ్యాండ్ గన్స్‌తో తిరిగి వచ్చి కాల్పులకు తెగబడ్డారని ఆయన చెప్పారు. కాల్పులకు కారణాలేమిటో ప్రస్తుతానికి తమకు తెలియవని, ఉగ్రవాదం కూడా కారణం కావచ్చని ఆయన చెప్పారు. కాగా, ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ, మామూలు పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరుగుతుందని తాము ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. 2012లో జరిగిన శాండీహుక్ స్కూలు మూకుమ్మడి మారణ కాండ తర్వాత అమెరికాలో ఇంత దారుణం జరగడం ఇదే తొలిసారి.