Others

అక్కడైతే బావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాల్లో నటించడానికి వచ్చిన తెలుగురాని భామలంతా ఒకే ఒక మంత్రాన్ని నేర్చుకొని వస్తున్నారు. ఎందుకంటే ఆ ఒక్కమంత్రం చెప్పేస్తే తెలుగు ప్రేక్షకులు అభిమానులైపోతారని. ఎవరైనా కోచింగ్ ఇస్తున్నారో ఏమో! ఇప్పటికి లతాహెగ్డే పదహారవ అమ్మాయి అయి వుంటుంది. ఎవరొచ్చినా కానీ ఏది ఎలావున్నా, తాను మహేష్‌బాబు ఫ్యాన్‌నని చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది. తుంటరి సినిమాతో తెరంగేట్రం చేసిన లతాకూడా ఇదే చిలక పలుకులు పలుకుతోంది. ఒక్క తెలుగు మాట రాకపోయినా, ఒక్క తన సినిమా గురించి చెప్పుకోలేకపోయినా బాధపడడం లేదు. ఒక్కమాట మాత్రం చక్కగా చెబుతోంది. ఆగడు సినిమా చూశాక మహేష్‌బాబు అభిమానినైపోయానని, ఆయన డాన్సులు, పాటలు చూసి వీరాభిమానిని అయ్యానని పొగిడేస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌కి వచ్చాక ఇక్కడ హీరోల్ని పొగడటంవల్ల ఎన్ని లాభాలున్నాయో లతాహెగ్డేకి అప్పుడే అర్థమైపోయినట్టుంది.