రాష్ట్రీయం

ఎయిర్‌గన్ కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
* సొంత పూచీకత్తుపై విడుదల

పటన్‌చెరు, నవంబర్ 26: మెదక్ జిల్లా పటన్‌చెరు పట్టణంలో గురువారం ఎయిర్‌గన్ కలకలం రేగింది. పట్టణ శివారులో ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తూ కిందపడిన ఇద్దరు యువకుల నుండి ఎయిర్ గన్ బయటపడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వార్త దావానంలా పట్టణంలో వ్యాపించింది. చివరికి అది ఎయిర్‌గన్‌గా తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అందించిన ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ పాతనగరం పరిధిలోని యాకుత్‌పురాకు చెందిన ఈద్‌బజార్‌కు చెందిన మగ్ధుం ఆజమ్ (24), ముజఫర్ అహ్మద్ మాలిక్ (22) ఇంజనీరింగ్ విద్యార్థులు. మగ్ధుం ఆజమ్ ఇప్పటికే బిటెక్ పూర్తి చేయగా మజుఫర్ అహ్మద్ మాలిక్ చేవెళ్లలోని హల్ హబీబ్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇదిలాఉండగా సంగారెడ్డి మండలం చేర్యాల గ్రామ శివారులలో వారి కుటుంబీకులకు చెందిన ఫాంహౌస్‌కు అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటారు. అదే మాదిరిగా గురువారం ఉదయం వెళ్లిన ఆ ఇద్దరు యువకులు తిరిగి మధ్యాహ్నం ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో పట్టణ శివారులలో గల నవాపాన్ పరిశ్రమ వద్ద పట్టు తప్పి కిందపడటంతో వారి వద్ద నుండి ఎయిర్ గన్ రహదారిపై పడింది. ఆ యువకులకు సహాయం అందించడానికి వచ్చిన కొందరు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. పటన్‌చెరు సిఐ లింగేశ్వర్, ఎస్‌ఐలు భరత్ ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌గన్‌ను 3500 రూపాయలకు బుధవారం కొనుగోలు చేసినట్లు వారి నుండి రసీదు కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని గౌస్ లెదర్ పేరిట ఉన్న దుకాణం నుండి ఎయర్‌గన్‌ను కొనుగోలు చేసినట్లు ఉందని సిఐ తెలిపారు. ఎయిర్‌గన్ కోసం లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ రసీదులో స్పష్టంగా ఉంది. దీంతో విచారణ అనంతరం సొంతపూచీకత్తుపై యువకులను విడుదల చేశారు.
================

పత్తి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
రెండుకోట్ల ఆస్తి నష్టం * తృటిలో తప్పిన ప్రాణాపాయం
షాద్‌నగర్, నవంబర్ 26: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని రాఘవేంద్ర కాటన్ కార్పొరేషన్ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. పట్టణ శివారులోని రాఘవేంద్ర కాటన్ పరిశ్రమకు ఉదయం అక్కడి కార్మికులు డిసిఎం వ్యాన్ నుండి పత్తిని అన్‌లోడ్ చేస్తుండగా పైనుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వ్యాన్ పైభాగం, పరిశ్రమ పైభాగం రేకుల మధ్య స్పార్క్ రావడంతో మంటలు వ్యాపించాయ. వెంటనే షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లలోని అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయ. అయతే, అప్పటికే దాదాపు 75 శాతం పత్తి కాలిపోయింది. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ గల పత్తి దగ్ధమైందని మిల్లు యజమాని యంసాని శ్రీనివాస్ తెలిపారు. షాద్‌నగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.