రాష్ట్రీయం

ప్రజారోగ్యమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో 10 ఎయిమ్స్ సంస్థలు రాష్ట్రానికి క్యాన్సర్ కేర్ సెంటర్లు
మూడేళ్లలో ఎయిమ్స్ నిర్మాణం కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకాష్ నడ్డా
గుంటూరు, డిసెంబర్ 19: ఢిల్లీ లాంటి మహానగరాలకే పరిమితమైన వైద్య సేవలను చిన్న పట్టణాలకు సైతం విస్తరింపజేయాలనే సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన (ఎయిమ్స్) సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకాష్ నడ్డా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద శనివారం ఎయిమ్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ అప్పటి ప్రధాని వాజపేయి దేశంలో 6 ఎయిమ్స్ సంస్థలకు అనుమతి ఇవ్వగా, ప్రస్తుత ప్రధాని మోదీ 10 సంస్థలను మంజూరు చేశారని చెప్పారు. ఒక్కో ఎయిమ్స్ సంస్థలో 900 నుంచి 1000 వరకు పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో 70 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నామన్నారు. దేశంలోని 58 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. తద్వారా మెడికల్ కాలేజీలు ఆసుపత్రులుగా అభివృద్ధి చెంది ప్రజలకు వైద్య సదుపాయాలు చేరువవుతాయన్నారు. గతంలో అంటువ్యాధులు ఎక్కువగా ఉండేవని, కాలగమనంలో వచ్చిన మార్పుల కారణంగా మధుమేహం, క్యాన్సర్, శ్వాస సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతో 60శాతం మంది మరణిస్తున్నారన్నారు. ఎపిలో పది క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతున్నామని చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ను 193 ఎకరాల్లో 1618కోట్ల రూపాయలతో మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళుతోందని, అందుకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన సమయంలో నష్టం జరిగిందనే ఉద్దేశంతో కేంద్రం నుంచి అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నామన్నారు. అట్టడుగు వర్గాల ఎన్నికల తాయిలాలకే పరిమితం కాకుండా శాశ్వతంగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
ఏపీని మెడికల్ హబ్‌గా మారుస్తాం: చంద్రబాబు
దేశ విదేశాల నుంచి పౌరులు రాజధాని అమరావతికి వచ్చి వైద్యసేవలు పొందేలా ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాబోయే ఏడాదిలో ఎయిమ్స్ తరగతులు ప్రారంభించి రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తే ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు. అమరావతికి ఎయిమ్స్ మణిహారం వంటిదని, దీనికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రుల ఎదుట ప్రతిపాదించారు.ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా కేంద్రాల్లో 51 ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రులు 31, కమ్యూనిటీ కేంద్రాల్లో 17, ప్రాథమిక కేంద్రాల్లో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ‘అన్న సంజీవ్’ పథకం ద్వారా జనరిక్ మందులను డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్‌వాడీ వర్కర్లకు పెంచిన వేతనాల కారణంగా రాష్ట్ర ఖజానాపై 311 కోట్ల రూపాయల భారం పడిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్రం అన్నివిధాలా సహకరిస్తోందన్నారు. అయితే సెంట్రల్, ట్రైబల్, పెట్రోల్ యూనివర్సిటీలు రావాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, ఎంపిలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) మంగళగిరి వద్ద ఎయిమ్స్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకాష్ నడ్డా, సిఎం చంద్రబాబు