జాతీయ వార్తలు

గొంతు నులమడం వల్లే షీనా బోరా మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిమ్స్ వైద్యుల నివేదిక వెల్లడి
ముంబయి, నవంబర్ 24: షీనా బోరా ఎలా మరణించిందన్న ఊహాగానాలకు ఎయిమ్స్ వైద్యుల నివేదిక తెరదించింది. గొంతు నులమడం వల్ల ఊపిరాడక షీనా బోరా మరణించిందని ఆ నివేదిక బయటపెట్టింది. షీనా మరణానికి సంబంధించి చిక్కుముడులను విప్పేందుకు నియమించిన ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదికను సిబిఐ చార్జిషీట్‌కు జతపరిచారు. ఆ నివేదిక ప్రకారం షీనా బోరాను బలవంతంగా గొంతు నులమడంతో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచిందని వైద్యులు నిర్ధారించారు. చేతుల ద్వారా గానీ, ఇతరత్రా గానీ షీనాకు ఊపిరి అందకుండా చేశారని పేర్కొన్నారు. పరీక్షల నిమిత్తం పంపిన అస్థిపంజరం సుమారు 23 ఏళ్ల వయసున్న యువతిదిగా గుర్తించామని, మూడేళ్ల క్రితం ఈ మరణం జరిగి వుంటుందని తెలిపారు. వివిధ పరీక్షల ద్వారా వెల్లడైన అంశాలు షీనాకు దగ్గరగా ఉన్నాయని వైద్యులు వివరించారు. 2012 ఏప్రిల్‌లో జరిగిన ఈ హత్య సమయానికి షీనా వయసు 24 అని, ఎముకలు సైతం కాలిపోయి ఉన్నాయని, మృతదేహాన్ని మొత్తం తగులబెట్టడం ద్వారా ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నం స్పష్టమవుతోందని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోందని వైద్యులు తమ నివేదికలో స్పష్టం చేశారు. కాగా, ముంబయికి 84 కి.మీ ఉన్న రాయగఢ్‌లోని అటవీ ప్రాంతానికి షీనాబోరాను కారులో తీసుకెళ్లి హత్య చేయడం, ఆ తర్వాత తగులబెట్టడం, మూడేళ్ల తర్వాత ఈ దారుణ ఉదంతం వెలుగుచూడటం తెలిసిందే.