సబ్ ఫీచర్

సాహస కృత్యాలు మగువలకు సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహనాలు నడుపుతూ సుదీర్ఘ యాత్రలు చేయడంలో మహిళలు మగాళ్లకు ఏ మాత్రం తీసిపోరని ఆ ముగ్గురు సాహస వనితలూ నిరూపించారు. మహిళా సాధికారతపై అవగాహన కలిగించడమే ధ్యేయంగా వారు ఒకే కారులో బయలుదేరి 97 రోజుల్లో 21,477 కిలోమీటర్ల మేరకు సాహస యాత్ర పూర్తిచేసి అందరి చేత ‘ఔరా’ అన్పించుకున్నారు. ముంబయికి చెందిన రష్మి గురురాజా, డాక్టర్ సౌమ్య, నిధి తివారీ గత జూన్‌లో తమ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకు 600 కిలోమీటర్ల మేరకు కారులో ప్రయాణించి వీరు 17 దేశాల్లో పర్యటించారు. మైన్మార్, చైనా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, యుకె తదితర దేశాల్లో పర్యటించి మహిళా సాధికారతపై విస్తృత ప్రచారం చేశారు. ఈ యాత్ర మొత్తంలో నిధి తివారీ ఒక్కరే కారు నడిపి రికార్డు సృష్టించారు. అధ్యాపకురాలిగా పనిచేసే నిధికి డ్రైవింగ్ అంటే ఎంతో మక్కువ. ఈ నేపథ్యంలోనే రోడ్డు మార్గంలో సుదీర్ఘ యాత్ర చేయాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. తన సంకల్పం గురించి స్నేహితురాళ్లయిన రష్మి, సౌమ్యలకు చెప్పి సాహస యాత్రకు వారిని ఆమె ఒప్పించారు. రష్మి హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా, సౌమ్య ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న ఈ ముగ్గురూ చేపట్టిన సాహస యాత్రకు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖతో పాటు మహీంద్ర ఫస్ట్ చాయిస్, లెనోవా ఇండియా, వయా డాట్ కామ్ వంటి సంస్థలు కూడా అన్ని విధాలా ప్రోత్సాహం ఇచ్చాయి. వీరి యాత్రకు మహీంద్రా సంస్థ సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన కారును ఉచితంగా అందజేసింది. డ్రైవింగ్‌లో మహిళలను ముందంజలో నిలిపేందుకు ‘ఉమెన్ బియాండ్ బౌండరీస్’ అనే సంస్థను నిధి గత మార్చిలో ప్రారంభించారు. ‘ఫేస్‌బుక్’ వంటి సామాజిక మీడియాలోనూ ఆమె విస్తృత ప్రచారం చేస్తున్నారు. డ్రైవింగ్, పర్వతారోహణ వంటి సాహస కృత్యాల పట్ల మహిళల్లో అవగాహన పెంచేందుకు 17 దేశాల్లో సాహస యాత్ర చేశామని నిధి చెబుతున్నారు. అడవులు, పాడైన రహదారుల వెంబడి ముగ్గురం కారులో ప్రయాణించడం మరచిపోలేని మధురానుభూతిని కలిగించినట్లు వీరు తెలిపారు. మైన్మార్‌లో పర్యటిస్తున్నపుడు కొండచరియలు విరిగిపడడం వంటి చేదు అనుభవాలను సైతం తాము చవిచూశామన్నారు. తాము ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, భద్రత దృష్ట్యా రాత్రి పూట మాత్రం ఎక్కడా ప్రయాణించలేదని వారు తమ అనుభవాలను వివరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మహిళలు వారి ఇళ్లలో వండిన వంటకాలను ప్రేమగా ఇచ్చారని, వారి సంస్కతీ సాంప్రదాయాలను స్వయంగా తెలుసుకున్నామని నిధి తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లినా, అన్ని విషయాల్లో స్ర్తిలు ముందంజలో ఉండాలని, సాహసాలు చేసేందుకు వెనుకంజ వేయరాదని, సాధికారత సాధించేందుకు బాగా చదువుకోవాలన్న విషయాలను వివరించేవారిమని చెప్పారు. చాలా దేశాల్లో హైవేలపై మహిళలు వాహనాలను నడపడం తాము చూడలేదని డాక్టర్ సౌమ్య చెబుతున్నారు. యూరప్ దేశాల్లో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు. (చిత్రం) రష్మి గురురాజా, డాక్టర్ సౌమ్య, నిధి తివారీ