జాతీయ వార్తలు

సరయిన పంథాలోనే సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిరోజులు వస్తాయన్న బిజెపి సీనియర్ నేత అద్వానీ
అహ్మదాబాద్, నవంబర్ 22: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయంపై పరోక్షంగా దాడికి దిగిన సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ఆదివారం దేశంలో మంచి రోజులను (అచ్ఛే దిన్) తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సరయిన పంథాలో నడుస్తోందని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆదివారం ఖాన్‌పూర్ పోలింగ్ బూత్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్న అద్వానీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సరయిన దారిలో సాగుతున్నందున మంచి ఫలితాలు వస్తాయన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. మొత్తం వ్యవస్థ మారడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే దేశంలో మంచి రోజులు తీసుకొస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమయిందా? అని ప్రశ్నించగా, అద్వానీ పైవిధంగా సమాధానమిచ్చారు. అహ్మదాబాద్ సహా గుజరాత్‌లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఆదివారం పోలింగ్ జరిగింది.
బిహార్‌లో ఓటమి తరువాత గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పరిస్థితి ఎలా ఉంటుందని భావిస్తున్నారని ప్రశ్నించగా, విజయం కోసం బిజెపి తన కృషిని మరింత పెంచిందని, అందువల్ల గెలుపు తథ్యమని ఆయన బదులిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎంపీలకు అనుమతిచ్చినందుకు తనకు సంతోషంగా ఉందని అద్వానీ వ్యాఖ్యానించారు.(చిత్రం) అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆదివారం ఖాన్‌పూర్ పోలింగ్ బూత్‌లో అద్వానీ