సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అధికారి ఫోన్ నెంబర్ ఓ కాగితం మీద రాసి కానిస్టేబుల్ చేతికిచ్చి చెప్పాడు.
‘సిటీలోని బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుకి వెళ్లి ఈ నెంబర్‌కి కాల్ చేసి నేను పంపానని చెప్పు. అతను ఇచ్చిన కవరు తీసుకురా...’
అతను వెళ్లిన అరగంటకి కుమార్ అత్తవారి ఊరు వెళ్లిన కానిస్టేబుల్ వచ్చాడు. అతను చెప్పిన సమాచారం జాగ్రత్తగా విన్నాడు యుగంధర్. అతన్ని పంపేసి కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. కుమార్ కేసులో ముఖ్యమైన మెలిక ఏదో ఉంది. తెలిసిన వాళ్లే అతన్ని హతమార్చారు. దానికి బలమైన కారణమే ఉంటుంది. అది తెలిస్తే కేసు మబ్బులా విడిపోతుంది.
లంచ్ స్టేషన్‌కి తెప్పించుకున్నాడు యుగంధర్.
సరిగ్గా మధ్యాహ్నం మడుకి కాల్స్ లిస్టు చేతికొచ్చింది. జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకూ కాల్స్ చాలా వున్నాయి. జూన్ ఇరవై ఒకటి అంటే హత్య జరిగిన రోజు. మధ్యాహ్నం మూడున్నరకి ఓ కాల్ ఉంది. దాన్ని అండర్‌లైన్ చేశాడు. ఇరవై రోజుల్లో ఆ నెంబరు చాలాసార్లు రిపీట్ అయ్యింది. అలా ఎక్కువగా చేసిన నెంబర్ మరొకటి లేదు.
తల పంకించాడు యుగంధర్.
***
‘నీ పేరు?’ అడిగాడు యుగంధర్. ఎదురుగా నిలబడిన ఇరవై మూడేళ్ల యువకుడ్ని.
‘్భరత్ అండి..’ చిన్నగా చెప్పేడు. అతని కళ్లల్లో భయం, పోలీసులు తనని స్టేషన్‌కి ఎందుకు పిలిచారో తెలియక.
‘బి.టెక్ అయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదా?’
‘క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానండి. కంపెనీ ఇంకా పిలవలేదు’
‘నీతోపాటు బి.టెక్ చేసిన నీ స్నేహితులు ఎవరు?’
అతని కళ్లల్లోకి చూస్తూ అడిగాడు యుగంధర్.
‘రమణ, రామశర్మ నాతోపాటు బి.టెక్ చదివారు. వాళ్లది కూడా మా గ్రామమే’ జవాబిచ్చాడు భరత్.
‘కాలేజీలో చదువుతున్నప్పుడు నువ్వో అమ్మాయిని ప్రేమించావు. ఆమె పేరేంటి?’
ఉలిక్కి పడ్డాడతను.
‘అలాంటిదేమీ లేదండి.. నేనెవర్ని ప్రేమించలేదు’
‘పోనీ నీ స్నేహితులు ప్రేమించారా?’
అతను మాట్లాడలేదు.
‘పర్లేదు చెప్పు...’
‘రమణ ఓ అమ్మాయికి సైట్ కొట్టేవాడు కాని అది కాలేజీ వదిలేనాటికి అంతమయింది. రామశర్మ మాత్రం ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు’
తలాడించి అడిగేడు యుగంధర్.
‘ఆ అమ్మాయి పేరేమిటి?’
‘నాకు గుర్తు లేదండి’
‘ఉమ కదూ!’
తెల్లబోయి చూశాడు భరత్.
‘కుల పట్టింపులతో ఉమ తల్లిదండ్రులు రామశర్మని కాదన్నారు. తమ కూతుర్ని రక్షించుకోవడానికి అప్పటికప్పుడు ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశారు. అవునా?’
వౌనంగా తలూపాడతను.
‘మీ స్నేహితులు ముగ్గురూ ఆ పెళ్లికి వెళ్లారు. ఉమని చేసుకోబోతున్న యువకునితో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. అప్పటి నుంచి అతనితో స్నేహం చెయ్యసాగేరు. జూన్ ఇరవై ఒకటి ఉదయం నీ బండి మీద రమణని, రామశర్మ బండి మీద పెళ్లికొడుకు కుమార్‌ని ఎక్కించుకుని హీరో షోరూమ్‌కి వెళ్లారు. కుమార్ కొత్త బైక్ డెలివరీ తీసుకున్నాక అంతా గ్రామానికి తిరిగొచ్చారు. బండి తీసుకున్న సందర్భంగా పార్టీ ఇమ్మని మీ ముగ్గురూ కుమార్‌ని అడిగారు. అతను అందుకు అంగీకరించాడు. సాయంకాలం బయలుదేరి కోటపాడు దగ్గరున్న సర్వేతోట చేరుకుని పార్టీ చేసుకున్నారు. కుమార్‌తో బాగా తాగించి హతమార్చి శవాన్ని తోటలో పారేసి తిరిగొచ్చారు’
శరీరమంతా చెమట పట్టి సన్నటి వణుకు మొదలైంది భరత్‌లో.
‘ముందుగా పథకం రూపొందించి కుమార్‌ని హతమార్చారు. కాబట్టి మీ ముగ్గురికి శిక్ష తప్పదు’ చెప్పాడు యుగంధర్.
ఒక్కసారిగా కాళ్ల మీద పడిపోయాడు భరత్.
‘నాకేం తెలియదు సార్! రామశర్మ పార్టీ కోసమే మమ్మల్ని అక్కడకు తీసుకెళ్లాడు. మందు తాగి స్పృహ కోల్పోయిన కుమార్ మెడకి తాడు బిగించి చంపాడు. అతను అలాంటి పని చేస్తాడని నాకు తెలియదు. ఈ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు సార్!’ వాపోయాడతను.
‘రామశర్మకి తెలివితేటలు చాలా ఎక్కువ. కుమార్‌ని హతమారిస్తే ఉమ తన స్వంతమవుతుందని ఆలోచించాడు. పెళ్లయ్యాక కూడా అర్ధరాత్రి గంట రెండు గంటలు రామశర్మతో మాట్లాడింది ఉమ. హత్య జరగడానికి ముందు కుమార్‌తో మాట్లాడేక ఉమకి కాల్ చేసాడు రామశర్మ. అంటే హత్య జరగబోతున్నదని ఉమకి కూడా తెలుసు’
‘సార్! నన్ను రమ్మన్నారట...’ అంటూ లోపలికి వచ్చాడు రామశర్మ. అక్కడ భయంతో వణికిపోతున్న భరత్‌ని చూసి అతని ముఖం మాడిపోయింది. వాళ్లిద్దర్నీ లాకప్‌లో పడేశారు కానిస్టేబుల్స్.
అదే రోజు సాయంకాలం యుగంధర్ సెల్ రింగయింది.
‘హలో.. ఇన్‌స్పెక్టర్ యుగంధర్ హియర్’
‘నమస్తే సార్! కలెక్టర్ పి.ఏ.ని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని రేపు ఉదయం పదకొండు గంటలకి ఆఫీసులో కలవమన్నారు కలెక్టర్‌గారు’ అటు నుంచి వినిపించింది.
‘దేని కోసం?’
‘తెలియదు సార్!’
సెల్ కట్టేసి కొన్ని క్షణాలు ఆలోచించాడు. కలెక్టర్ తనని ఎందుకు రమ్మన్నాడో అర్థం కాలేదు.
9
బార్ ఎదురుగా బైక్ పార్క్ చేశాడు వివేక్. అప్పటికి పదకొండు దాటింది సమయం. బార్ లోపలికి నడిచాడతను. అప్పుడే తెరవడంతో లోపల కస్టమర్లు లేరు. కుర్రాళ్లు కుర్చీలు సర్దుతూ టేబుళ్లు శుభ్రం చేస్తూ కనిపించారు. కౌంటర్ దగ్గర నిలబడి ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే సెల్ మోగింది.
‘హల్లో...’
‘వివేక్?’ అటు నుంచి అడిగేరు.
‘అవును’
‘మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకూ నీకు పని ఉంటుంది. జగదాంబ సెంటర్లో హోటల్ ఆనంద్‌లోని రూమ్ నెంబర్ ఫోర్ నాట్ త్రీకి వెళ్లాలి’
‘అలాగే’ బదులిచ్చాడు.
ఉత్సాహంగా సెల్ జేబులో ఉంచుకున్నాడు. సాధారణంగా మధ్యాహ్నం క్వార్టర్ విస్కీలో ఓ బీరు కలుపుకుని తాగుతాడు. భోజనం చేసి పడుకుంటే సాయంకాలం ఆరు వరకూ లేవడు. ఇప్పుడు డ్యూటీ ఉంది కాబట్టి మందు తీసుకోవడం మంచిది కాదు. నీట్‌గా స్టైలిష్‌గా లేకపోతే కంప్లైంట్ చేస్తారు అవతలి వాళ్లు. అందుచేత డ్యూటీ అయిపోయాక తాగొచ్చనే ఆలోచనతో ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు.
సంవత్సరం క్రితం ఓ సీనియర్ ద్వారా భూపతికి పరిచయమయ్యాడు అతను. మొదటగా భూపతి మనిషి ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేయించాడు. కొన్ని ఫొటోలు తీసుకున్నాక చివరగా చెప్పాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
ఎవరూ కనీవినీ ఎరుగని ఉద్యోగమది.
ఓ అమ్మాయిని పరిచయం చేసుకుని వాళ్లు చెప్పిన చోటుకి తీసుకెళ్లి కోరిక తీర్చాలి. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. ఈ పనికి పాతిక వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి. అప్పుడప్పుడూ డ్యూటీ కోసం పిలుస్తారు. వాళ్లు చెప్పిన చిరునామాకి వెళ్లి అక్కడున్న అమ్మాయితో గడపాలి. అది గంట కావచ్చు లేదా రాత్రంతా కావచ్చు. గంటకి అయిదొందలు, రాత్రికైతే రెండువేలు అకౌంట్‌లో పడతాయి. ఇవి కాకుండా నెలకి పదివేలు చెల్లిస్తారు.
ఈ సంవత్సర కాలంలో పదిహేను మందితో శృంగారం జరిపాడు. ఓ కాలేజీ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఖర్చులు పెరిగి ఆదాయం సరిపోవడం లేదు. బాగా ఆలోచించి ఇద్దరు యువతులతో కాంటాక్ట్ పెట్టుకున్నాడు. వాళ్లు పిలిచినప్పుడు వెళితే అయిదు వేలు ఇస్తారు. అలాంటిది మరో రెండు చూసుకుంటే కాలం హ్యాపీగా సాగిపోతుంది. ఈ వ్యవహారం బయటపడే అవకాశం ఎంత మాత్రం లేదు.
భూపతి నెట్‌వర్క్‌లో ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో తెలియదు. అంతా ఫోన్‌కాల్స్ మీద జరుగుతుంది కాబట్టి ఇంకో మనిషి గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఈ లొసుగుని తను ఉపయోగించుకున్నాడు. తెలివైనవాడు అవకాశాలు సృష్టించుకుంటాడు. అదే చేశాడు తను.
నిజానికి ఓ గంటసేపు పరాయి ఆడదానితో శృంగారమంటే చాలా తేలిక వ్యవహారంలా కనిపిస్తుంది. కాని కాదు. శృంగారానికి మొహం వాచిన ఆడవాళ్లు డబ్బు పారేసి సుఖం పొందాలనుకున్నప్పుడు అంత తేలిగ్గా వదిలిపెడతారా? ఆ గంటసేపు శరీరం మనది కాదనుకోవాలి. మదమెక్కిన మదవతిని మెప్పించాలి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ ఉద్యోగం అంతటితో సమాప్తమవుతుంది. వికారంగా ఉన్నవారిని మెప్పించేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది అందులోని కష్టం.
అతని సర్వీస్‌లో అలాంటి స్ర్తి ఒక్కసారే తగిలింది. సెక్స్‌లో ఆమె విపరీత మనస్తత్వానికి మతిపోయింది.
‘సార్! ఏమైనా తెమ్మంటారా?’ ఓ కుర్రాడు అడిగాడు. దానితో ఆలోచనల నుండి బయటపడ్డాడతను.
‘వద్దు.. మళ్లీ వస్తాను’ చెప్పి వాచీ చూశాడు. ఒంటి గంట కావడానికి ఇరవై నిమిషాలు ఉంది. వివేక్ లేచి బయటకొచ్చాడు. బైక్ స్టార్ట్ చేసి జగదాంబ జంక్షన్ వైపు పోనిచ్చాడు. ఆ థియేటర్‌ని ఆనుకుని వెనుక వైపు ఉంది లాడ్జి. పార్కింగ్ ప్లేస్‌లో బైక్ వదిలి లిఫ్టులో నాల్గవ అంతస్తు చేరుకున్నాడు. ఫోర్ నాట్ త్రీ దగ్గర ఆగి గుండెలనిండా ఊపిరి తీసుకుని కాలింగ్ బెల్ నొక్కాడు.
కొన్ని క్షణాల తర్వాత ఓ మెరుపు తీగ తలుపు తీసి చెప్పింది.
‘వెల్‌కమ్ వివేక్...’
గుండెల్లో ఉప్పొంగిన సంతోషాన్ని అణచుకుంటూ అతను లోపలికి నడిచాడు. ఆమె తలుపునకు బోల్ట్ పెట్టి వచ్చి మంచం మీద కూర్చుంది.
‘కూర్చో..’ చెప్పింది.
సరిగ్గా అప్పుడే ఆమె సెల్ మోగింది. కాల్ రిసీవ్ చేసుకుని అవతలి వాళ్లు చెప్పింది విని,
‘అలాగా.. వెంటనే వస్తున్నాను’ చెప్పి, సెల్ మంచం మీద పడేసి ఆశాభంగం చెందినట్టు అతని వైపు చూసింది.
‘సారీ వివేక్.. నేను అర్జెంట్‌గా వెళ్లాలి. మరోసారి కలుద్దాం’ అందామె.
‘ఇట్సాల్ రైట్’
ఆమె అద్దం దగ్గరకు వెళ్లి మేకప్ సరిచేసుకోసాగింది.
‘మరోసారి కలవాలంటే మళ్లీ డబ్బు చెల్లించాలి...’ చిన్నగా అన్నాడు వివేక్.
‘నీతో అనుభవం కావాలంటే తప్పదుగా’ నవ్వింది.
‘నాదో సూచన’
‘చెప్పు’
అతను ఓ క్షణం తటపటాయించి గొంతు విప్పాడు.
‘మీలాంటి అందగత్తె పొందు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప దొరకదు. నా సెల్ నెంబర్ తీసుకోండి. మీరెప్పుడు రమ్మంటే అప్పుడొస్తాను. మీ నెంబర్, చిరునామా నాకు అక్కర్లేదు. మన మధ్య ఓ పదం కోడ్‌గా పెట్టుకుందాం. నాకు ఫోన్ చేసి ఆ పదం చెబితే మీరని నాకు తెలుస్తుంది. ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తాను’
‘శే్వత..’ అందామె.
‘ఓకే..’ అని తన సెల్ నెంబర్ చెప్పాడు. ఆమె దాన్ని ఫీడ్ చేసుకుని చెప్పింది,
‘ఇక్కడ నుంచి ముందు నువ్వెళ్లు’
వివేక్ మాట్లాడకుండా బయటకు నడిచాడు. అంతవరకూ ఆన్‌లో ఉన్న తన సెల్ స్విచ్ ఆఫ్ చేసిందామె.
* * *
జ్ఞానాపురం రైల్వే క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది ఇన్నోవా. చివరి క్వార్టర్ దగ్గర వాహనం ఆపి కిందకి దిగేడు డ్రైవర్. అతను వినయంగా వెనుక డోర్ తెరిచి పట్టుకున్నాడు. లోపలి నుంచి ఎడమకాలు బయటపెట్టి దిగేడు గంగోత్రి. జీన్స్ మీద టీ షర్టు వేసుకున్నాడతను. కాళ్లకి ఖరీదైన బూట్లున్నాయి. తల స్నానం చేయడం వల్ల వత్తుగా, పొడిగా ఉన్న జుట్టుని జారుముడి వేశాడు.
‘నువ్వెళ్లు’ చెప్పాడు డ్రైవర్‌తో.
అతను వినయంగా నమస్కారం చేసి వాహనాన్ని వెనక్కి తిప్పి పోనిచ్చాడు.
ఇంతలో పది గజాల దూరంలోని తుప్పల మధ్య నుంచి హిజ్రాల బృందమొకటి బాజా భజంత్రీలతో వచ్చింది. వయసు మీరిన ఓ హిజ్రా వంగి దండం పెట్టి గంగోత్రితో చెప్పింది,
‘దయచేయండి’
వాళ్లందర్నీ చిరునవ్వుతో పలకరించి కదిలేడు గంగోత్రి.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994